YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కోటి వృక్షార్చనలో  భాగస్వామ్యమవుతాం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా)

కోటి వృక్షార్చనలో  భాగస్వామ్యమవుతాం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా)

కోటి వృక్షార్చనలో  భాగస్వామ్యమవుతాం
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా)
జగిత్యాల ఫిబ్రవరి 16, 
 తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ ల పిలుపు మేరకు    ముఖ్యమంత్రి కే సీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాధ్యత గల రెవెన్యూ ఉద్యోగులం,అధికారులముగా వాతావరణ  కాలుష్యం తగ్గించడం కోసం  ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా  కోటివృక్షార్చన కార్యక్రమంలో భాగస్వాములమవుదామని  తెలంగాణ రెవెన్యూ   ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.వకీల్,గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా రెవెన్యూ భవన్ లో  వారు మాట్లాడుతూ బుధవారం  ప్రతి మండల,డివిజన్, కలెక్టరేట్ కార్యాలయ ఆవరణల్లో,ఇతర అనువైన  స్థలాల్లో ప్రతి రెవెన్యూ   ఉద్యోగి బాధ్యత గల ఉద్యోగులముగా  మొక్కలను నాటి సీఎం కి పుట్టినరోజు కానుకగా  ఇద్దామన్నారు. మొక్కలు నాటి పరిరక్షణ బాధ్యత కూడా స్వీకరిద్దామని,మీరు నాటిన మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రతి మండలాల వారిగా ఫోటోలు తీసి గ్రీన్ ఇండియా యాప్ లో చేర్చడానికి   ట్రెసా జిల్లా  సంఘానికి పంపవల్సింది గా వారు కోరారు.సమావేశంలో  తహసీల్దార్లు నలువాల వెంకటేష్,దిలీప్ నాయక్, జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ,కోశాధికారి నాయిని తిరుమల రావ్,శ్రీనివాస్,  అబూబాకర్, రాజేందర్ రావు,రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts