YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిలతో రామచంద్రమూర్తి భేటీ

షర్మిలతో రామచంద్రమూర్తి భేటీ

షర్మిలతో రామచంద్రమూర్తి భేటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 17, 
వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఆమె లోటస్ పాండ్‌లో వైఎస్ అభిమానులతో భేటీ కావడానికి ముందే.. సీఎం కేసీఆర్ పరోక్షంగా స్పందించారు. రాజకీయ పార్టీ పెట్టడమంటే.. పాన్ షాప్ కాదని హెచ్చరించారు. జగన్‌తో విబేధాల కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. కానీ ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలే కానీ విబేధాలు కాదని వైఎస్సార్సీపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అదే సమయంలో షర్మిల పార్టీ పెడితే.. తమకు ఎలాంటి సంబంధం ఉండదని.. అది ఆమె వ్యక్తిగతమని సజ్జల ప్రకటించారు.పార్టీని ఏర్పాటు చేసే క్రమంలో షర్మిల.. భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. జిల్లాల నేతలకు ఫోన్లు చేసి లోటస్ పాండ్‌కు రావాలని ఆహ్వానిస్తున్నారు. దీంతో పలువురు నేతలు, వైఎస్ అభిమానులు ఆమెతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్ట్, జగన్ సర్కారుకు సలహాదారుగా వ్యవహరించిన రామచంద్రమూర్తి సోమవారం షర్మిలను కలిశారు. ఆయన ఇటీవలే ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు.జగన్ దగ్గర పదవిని వదులుకున్న రామచంద్రమూర్తి.. షర్మిలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. కొత్త పార్టీ విధివిధానాలు.. వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయమై.. ఆయన షర్మిలతో చర్చించారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి గుడ్ బై చెప్పిన ఆయన.. ఇక నుంచి షర్మిల వెంట నడుస్తారా..? అనే ప్రశ్న తలెత్తోంది
తెలంగాణ కోడలిని అంటూ కొత్త అస్త్రం
ఏపీ సిఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పటికే ఈ మేరకు వైఎస్ అభిమానుల సమ్మేళనం పేరిట రాజకీయ మంతనాలు కూడా చేస్తున్నారు. ఆమె త్వరలోనే పార్టీ ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.అందుతున్న సమాచారం మేరకు వైఎస్ షర్మిల ఒక కీలక అస్త్రం సిద్దం చేసినట్టు చెబుతున్నారు. షర్మిల రాయలసీమ వ్యక్తి అని ఆమె తెలంగాణలో రాజకీయాలు ఎలా చేస్తారు అంటూ టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె అందుకు గాను గట్టి ఆన్సర్ రెడీ చేసిందని అంటున్నారు. అదేమంటే తను తెలంగాణ కోడలిని కాబట్టి తాను తెలంగాణలో రాజాకీయం చేసే హక్కుందని ఆమె పేర్కొనడానికి రెడీ అయిందని అంటున్నారు.

Related Posts