YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

మరణశిక్ష విధించడం వల్ల అత్యాచారాలు ఆగుతాయా? ఢిల్లీ హైకోర్ట్

మరణశిక్ష విధించడం వల్ల అత్యాచారాలు ఆగుతాయా? ఢిల్లీ  హైకోర్ట్

మరణశిక్ష విధించడం వల్ల అత్యాచారాలు ఆగుతాయా అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఆర్డినెన్స్‌ ను ఏదో హడావిడిగా తెచ్చారని సామాజిక కార్యకర్తలు, బాధితుల తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తూంటే- మరణశిక్ష విధించడం వల్ల అత్యాచారాలు ఆగుతాయా అన్న అంశంపై పూర్తి పరిశీలన జరిపారా..హైకోర్టు ప్రశ్నించింది.ఆర్డినెన్స్‌కు ముందు శాస్త్రీయ అధ్యయనం చేశారా, రేప్‌కూ, హత్యకూ ఒకటే శిక్ష అయినపుడు- అత్యాచారం చేశాక ఆ రేపిస్టు ఆ బాధితురాల్ని బతకనిస్తాడా అని జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ హరిశంకర్‌లతో కూడిన బెంచ్‌ ప్రశ్నించింది. రేపిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చన్న-2013 నాటి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ చట్ట సవరణను సవాల్‌ చేస్తూ దాఖలైన ఓ పాత ప్రజాహిత దావా విచారణ సమయంలో బెంచ్‌ ఈ ప్రశ్నలు వేసింది. ఇవే ప్రశ్నల్ని సామాజికవేత్తలు, మాజీ జడ్జీలు సైతం వేస్తున్నారు.దీనితో పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించవచ్చన్న కేంద్ర ఆర్డినెన్స్‌ తీవ్ర చర్చకు దారితీసింది. హత్యకు, రేప్‌కూ శిక్ష ఒకటే అని తెలిశాక- చాలా మంది నేరగాళ్లు- సాక్ష్యం లేకుండా చేయడానికి - బాధితురాల్ని చంపేస్తారు. అత్యాచారం ఒక నరకమైతే, పుట్టిన బిడ్డను శాశ్వతంగా కోల్పోవడం మరీ దుర్భరం. ఈ ఆర్డినెన్స్‌ అలాంటి పరిస్థితికి తావివ్వరాదని అత్యాచారానికి గురైన ఓ బాలిక తల్లి పేర్కొంది. దీనివల్ల పిల్లలపై విపరీత పరిణామాలుంటాయి. ఇలాంటివి రేప్‌లను ఆపలేవఅని ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ ఏపీ షా అన్నారు.

Related Posts