YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

12 జిల్లాలకు నల్గొండేలోనే నామినేషన్లు

12 జిల్లాలకు నల్గొండేలోనే నామినేషన్లు

12 జిల్లాలకు నల్గొండేలోనే నామినేషన్లు
వరంగల్, ఫిబ్రవరి 16
వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ సెగ్మెంట్‌లో పోటీ చేసే అభ్యర్థులంతా అక్కడే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగాం పూర్తి జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాలతో విస్తరించి ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులంతా తమ నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్‌లోనే దాఖలు చేయాల్సి ఉంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారి నల్లగొండ కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారు. ఆర్‌వోకు నామినేషన్లు అందజేయాల్సి ఉంటుంది. దీంతో నల్లగొండ కలెక్టర్‌ చాంబర్‌లో నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఆదివారంతో పాటు ఇతర ప్రభుత్వ సెలవు దినాలు మినహాయిస్తే మిగిలిన అన్ని పనిదినాల్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 24న వచ్చిన అన్ని నామినేషన్లు నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో అని పరిశీలిస్తారు. ఆ తర్వాత సరైన నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. 25, 26వ తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 26 మధ్యాహ్నం 3గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబి తా ప్రకటిస్తారు. ఆ తర్వాత నుంచి ప్రచారానికి అవకాశం కల్పించారు. వచ్చే నెల 14న పోలింగ్‌ జరుగనుంది. అందుకోసం 546 పోలింగ్‌ కేంద్రాలను ఇప్పటికే ఎంపిక చేశారు. 17న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. నల్లగొండ పాలిటెక్నిక్‌ కాలేజీ పక్కనే ఉన్న స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ గోదాములను కౌంటింగ్‌కు ఎంపిక చేశారు.నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు మరో ముగ్గురికి మాత్రమే అనుమతించనున్నారు. గతంలో ఐదుగురిని అనుమతించగా కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో నలుగురికే పరిమితం చేశారు. ఇక నామినేషన్ల దాఖలుకు వచ్చే సమయంలోనే రెండు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. కలెక్టరేట్‌కు వంద మీటర్ల లోపు ఎలాంటి ర్యాలీలు, సభలకు కూడా అనుమతి లేదు. నామినేషన్ల సందర్భంగా ర్యాలీలు, సభలు ఏర్పాటు చేయాలనుకుంటే వారికి సింగిల్‌విండో సిస్టమ్‌ ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు. అనుమతుల కోసం ముందు రోజు రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు పెట్టుకుంటే వాటిని జిల్లా ఎస్పీ, ఇతర అధికారులకు పంపిస్తారు. తిరిగి వాటికి తుది అనుమతులు రిటర్నింగ్‌ అధికారి ద్వారానే సంబంధిత పార్టీలకు, వ్యక్తులకు అందజేస్తారు. అయితే నామినేషన్ల దాఖలు సమయంలో లేదా ప్రచార సమయంలోనూ ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు, సభలకు అనుమతులు కావాలంటే ఆయా జిల్లాల్లో ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారే అనుమతి పత్రాలను అక్కడే జారీ చేస్తారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో జనరల్‌, బీసీ అభ్యర్థ్ధులు రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థ్ధులు రూ.5 వేల చెల్లిస్తే సరిపోతుంది. అయితే నామినేషన్‌ పత్రాలతో పాటు సంబంధిత అధికారి ధ్రువీకరించిన కుల ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పిస్తేనే రూ.5 వేల నిబంధన వర్తించనుంది. ఇక నామినేష్లను ఉపసంహరించుకుంటే ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వనున్నారు.నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశాం. నేడు నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. అనంతరం ఉదయం 11గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తాం. ఇప్పటికే షెడ్యూల్‌లో ఉన్న ప్రకారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థ్ధులంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే. లోపలికి వచ్చే వారు విధిగా మాస్కులు ధరించాలి. శానిటైజ్‌ చేసుకుని లోపలికి రావాలి. భౌతిక దూరం పాటించాలి. ఆయా పార్టీలు, లేదంటే సంస్థలు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ సహకరించాలి.

Related Posts