వివాదంలో కాణిపాకం ఆలయ కెమెరాలు
చిత్తూరు ఫిబ్రవరి 17,
చిత్తూరు జిల్లా కాణిపాకం గర్భాల యంలో సిసి కెమెరాలను వెంటనే తొలగించాలని బీజేపి డిమాండ్ చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ప్రధానాలయం గర్భాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వెంటనే తొలగించాలని బిజెపి ఓబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాణిపాకం ఆలయం గర్భాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు ఆగమ శాస్త్రం పై అవగాహన లేని వ్యక్తులను ఈవో గా నియమించడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగమశాస్త్రం పై అవగాహన ఉన్న వ్యక్తిని ఆలయ ఈవో గా నియమించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం ఆలయంలో తన తప్పులను సరిదిద్దు కోవడానికి ప్రజలు సత్య ప్రమాణాలు చేస్తుంటారని తెలిపారు.అయితే గర్భగుడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా సత్య ప్రమాణాలు చేసే వ్యక్తుల వివరాలు బయటకు వెళ్ళే అవకాశం ఉందని తెలిపారు కావున ఈ సిసి కెమెరాలను వెంటనే తొలగించి అవసరమైనచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అట్లూరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గర్భాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు ఈ విషయమై స్థానిక పెద్దలు కూడా స్పందించాలని తెలిపారు... ఆలయంలో సిసి కెమెరాలు ఏర్పాటు విషయమై ఆలయ అధికారులు ఆగమ పండితులు సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. ఆలయ అర్చకులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం బిజెపి తీవ్రంగా ఖండిస్తూ నట్లు తెలిపారు. ఆగమ శాస్త్రం పై ఎటువంటి అవగాహన లేని ప్రస్తుత ఆలయ ఈవో ని వెంటనే బదిలీ చేసి ఆగమశాస్త్రం పై అవగాహన ఉన్న వ్యక్తిని ఈఓగా నియమించాలని బిజెపి తరఫున డిమాండ్ చేస్తున్నట్లు అట్లూరి శ్రీనివాసులు తెలిపారు.