YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

241 శాతం లాభపడిన షేర్

241 శాతం లాభపడిన షేర్

దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ తొలిసారిగా 11 వేల పాయింట్ల మైలురాయిని, అటు బీఎస్ఈ సెన్సెక్స్ 36 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించాయి.  త్వరలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మార్కెట్ వర్గాల్లో నెలకొన్న ఆశాజనకమైన దృక్పథంతో పాటు కార్పొరేట్ ఆదాయం బాగుందన్న సంకేతాలు స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ మదుపర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు కూడా మొగ్గుచూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. 

నిఫ్టీ 10 వేల పాయింట్ల నుంచి 11 వేల స్థాయికి చేరుకునేందుకు ఆరు మాసాల సమయం పట్టింది. 2017 జులై 25న నిఫ్టీ తొలిసారిగా 10 వేల పాయింట్ల మార్క్‌ను చేరుకుంది. నిఫ్టీ 10 శాతం వృద్ధి సాధించేందుకు ఆరు మాసాల సమయం తీసుకున్నా...కొన్ని షేర్లు ఈ ఆరు మాసాల్లోనే ఏకంగా 46 శాతం లాభపడ్డాయి. టెక్ మహీంద్ర షేరు గత ఆరు మాసాల్లో ఏకంగా 46 శాతం వృద్ధి సాధించింది. టాటా స్టీల్, మారుతి సుజుకి, ఓఎన్జీసీ, గెయిల్ తదితర షేర్లు గత ఆరు మాసాల్లో 20 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. 

అటు రైన్ ఇండస్ట్రీస్ షేర్ గత ఆరు మాసాల్లో ఏకంగా 241 శాతం వృద్ధి సాధించింది. 2017 జనవరి 23న రూ.64గా ఉన్న ఆ షేర్ విలువ...2018 జనవరి 9న 52 వారాల గరిష్ఠ స్థాయిలో రూ.475కు చేరుకుంది. మంగళవారం ఇది రూ.430లకు ఎగువున ట్రేడ్ అవుతోంది. అలాగే రాడికో కైటాన్ షేరు 201 శాతం, పీసీ జవెలర్ షేరు 130 శాతం వృద్ధి సాధించింది. వక్రంగీ(112 శాతం), వీఐపీ ఇండస్ట్రీస్(106శాతం), జేఎస్‌పీఎల్(88శాతం), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యునికేషన్స్ లిమిటెడ్(85శాతం), జుబిలంట్ ఫుడ్ వర్క్స్(75 శాతం), టోరంట్ పవర్(72 శాతం) అత్యధిక లాభాలు నమోదు చేసుకున్నాయి. 

Related Posts