కంభంపాటి హరిబాబు రాజీనామాతో ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో అనూహ్యంగా దగ్గుబాటి పురందేశ్వరి వచ్చి చేరారు. తనకు రాష్ట్ర రాజకీయాలకన్నా, జాతీయ రాజకీయాలపైనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని ఎప్పుడూ చెప్పే పురందేశ్వరిని, ఈ పదవికి ఎంపిక చేస్తే బాగుంటుందని పలువురు ఏపీ బీజేపీ నేతలు అధిష్ఠానానికి విన్నవించినట్టు తెలుస్తోంది.రాష్ట్ర అధ్యక్ష పదవిపై గందరగోళం కొనసాగుతుండగా, సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ చీలుతుందని ఆకుల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాత్రం ఆ పదవిని సోము వీర్రాజుకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నేత కోసం చూస్తున్న బీజేపీ ముందుకు పురందేశ్వరి పేరు వచ్చినట్టు సమాచారం.