YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బాంబు పేల్చిన మాజీమంత్రి గంటా..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బాంబు పేల్చిన మాజీమంత్రి గంటా..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బాంబు పేల్చిన మాజీమంత్రి గంటా..
        ఉలిక్కిపడ్డ తెలుగు తమ్ముళ్ళు
విజయవాడ ఫిబ్రవరి 17 
తెలగుదేశంపార్టీకి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పెద్ద షాకిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాపంలో టీడీపీకి కూడా వాటా ఉందంటు బాంబు పేల్చారు..దేనితో తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ఉక్కు ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా రాజకీయపార్టీల నేతలు కూడా రంగంలోకి దిగారు.ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు వైసీపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వామపక్షాల నేతలు పాల్గొంటే తెలుగుదేశంపార్టీ నేతలు మాత్రం కలవటం లేదు. సరే బీజేపీ+జనసేన నేతలు ఎలాగూ కలవరు. ఎవరితోను కలవక మరి టీడీపీ ఏమి చేస్తోంది ? ఏమి చేస్తోందంటే సపరేటుగా ఆందోళన మొదలుపెట్టింది. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలకు రెడీ అని కింజరాపు అచ్చెన్నాయుడు చెబుతుంటే చంద్రబాబాయుడు మాత్రం సపరేటు ట్రాక్ లో నడిపిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే గంటా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. గంటా రాజీనామా చేయటంతో మిగిలిన వాళ్ళపై ఒత్తిడి పెంచుతోంది. వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు పోటీగా చంద్రబాబు కూడా మంగళవారం విశాఖపట్నం వెళ్ళి పార్టీ నేతలతో మాట్లాడారు. అక్కడ కూడా మళ్ళీ జగన్నే టార్గెట్ చేస్తు నోటికొచ్చినట్లు మాట్లాడారు. మాట్లాడాల్సింది కేంద్రప్రభుత్వం గురించి నిలదీయాల్సింది నరేంద్రమోడిని అయితే చంద్రబాబు మాత్రం అసలా ఊసే ఎత్తకుండా కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలోనే గంటా మాట్లాడుతు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో టీడీపీకి కూడా వాటా ఉందని పెద్ద బాంబు పేల్చారు. ఎందుకంటే 2018లో కేంద్ర ఉక్కుపరిశ్రమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోస్కో ప్రతినిధులతో పాటు మరికొందరు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలోనే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయం జరిగింది. ఆ తర్వాత అంటే 2019 అక్టోబర్లో జగన్ వచ్చిన తర్వాత ఎంవోయు కుదిరింది. ఈ విషయాన్నే గంటా ఇపుడు ప్రస్తావిస్తున్నారు. తాజాగా గంటా చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది.

Related Posts