YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సోనియా గాంధీ ఆదేశాలతో పాదయాత్ర ఎంపీ రేవంత్ రెడ్డి

సోనియా గాంధీ ఆదేశాలతో పాదయాత్ర ఎంపీ రేవంత్ రెడ్డి

సోనియా గాంధీ ఆదేశాలతో పాదయాత్ర
ఎంపీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 17 
ఏఐసిసి ఆదేశాలతో నా పాదయాత్ర జరిగింది. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చింది. పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి ఈ నల్ల చట్టాలపై అవగాహన కల్పించాలని సోనియా గాంధీ ఆదేశించారు. సోనియా గాంధీ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగానే నేను పాదయాత్ర ద్వారా జనం లోకి వెళ్ళానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. నా పాదయాత్రలో దారిపొడుగునా వేలాది మంది నా పై చూపిన ఆదరణకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా.చాలా మంది నేరుగా నన్ను కలవ లేక పోయారు .. అలాంటి వారు ఎక్కడా బాధపడవద్దు.  భవిష్యత్తు లో చేయబోయే కార్యక్రమాల్లో మీ అందరి సహకారం కావాలి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడంతో కేసీఆర్ కు చిత్తశుద్ది లేదు. చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీ లో ఈ చట్టాలను మేము అమలు చేయమని తీర్మానం చేయాలి. కేంద్రం చేసిన చట్టాలను అధా తదంగా అమలు చేయాల్సిన అవసరం రాష్ట్రాలకు లేదు. ఇవన్నీ కేసీఆర్ కు తెలియక కాదు .. కానీ నాటకాలు ఆడుతున్నాడు. కేసీఆర్ అదే దురభి నాటకాలకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీ లాపై చూపే ప్రేమ రైతులపై చూపడం లేదు. దేశంలో లాభసాటిగా ఉంటే అనేక కంపెనీలను మోదీ ప్రవేటు పరం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉండే కంపెనీలను ప్రవేట్ పరం చేస్తూ .. నష్టాల్లో ఉండే ప్రవేట్ కంపెనీల నష్టాన్ని కేంద్రం భరిస్తోంది ఇది చాలా దుర్మార్గమని అన్నారు. 
రైతులకు ఉండే అన్ని హక్కులను బహుళ జాతి కంపెనీలు అప్పజెప్పి ప్రయత్నమే ఈ వ్యవసాయ చట్టాలు. ఈ విషయంలో కేసీఆర్ మోదీ తో జట్టు కట్టి రైతుల కు అన్యాయం చేస్తున్నారు. రుణమాఫీ విడతల వారిగా ఇవ్వడం వల్ల రైతులాపై వడ్డీ భారం పడుతుంది. నిర్భంద వ్యవసాయం చేయమన్న ది కేసీఆర్ కాదా. కేసీఆర్ చెబితే రైతులు పండించిన సన్నాల వడ్ల కు ఎందుకు బోనస్ ఇవ్వరు. పత్తి పండించిన రైతులు నిండా మునిగిపోయింది. భీమా పధకం అమలు కాకుండా పోవడానికి కారణం .. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం వల్లేనని అన్నారు. ఇంట్లో ఇద్దరికీ పించన్ ఇవ్వక పోవడం వల్ల వృద్దులు చాలా అవస్థలు పడుతున్నారు. పాదయాత్రలో చాలా మంది వృద్దులు నాదృష్టికి ఈ విషయాలు తీసుకొచ్చారు. మొగుడు చనిపోయిన మహిళలకు వితంతు పింఛన్లు లేవు. పల్గు తాందాలో 18 వందల ఎకరాల భూమిలో ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న లంబాడాల ను వెళ్లకొట్టే ప్రయత్నం జరుగుతోంది.  కొంత మంది టిఆర్ఎస్ ఎమ్మేల్యేలు అక్రమించుకు నే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. 
అమన్ గల్ మండలం కుప్పడండ్ల వద్ద తాండాలో దారుణం జరుగుతుంది. కేసీఆర్ ఈ విషయంలో సీరియస్ గా స్పందించి .. తమ ఎమ్మేల్యేలు దురాగతాలను అడ్డుకొని లంబాడా లకు న్యాయం చేయాలి. టమాట సాస్ కంపెనీలతో సీఎం మాట్లాడి టమాట రైతులకు న్యాయం చేయాలి. ఫార్మా సిటీ పేరుతో రైతుల నుంచి భూమిని గుంజు కుంటున్నారు. నిరసన తెలిపిన రైతులపై క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. నామ మాత్రపు రేట్లకు రైతుల నుంచి భూములు తీసుకుంటున్న ప్రభుత్వం .. కోట్ల రూపాయలకు ప్రవేటు పంపెనీలకు అమ్ము కోవడం దుర్మార్గం. రైతుల జీవితాలతో ప్రభుత్వం వ్యాప్తం చేయడం నేరపూరిత చర్య. ఇలాంటి చర్యలకు పడుతున్న ప్రభుత్వ పెద్దల పై క్రిమినల్ కేసులు పెట్టాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండే వెయ్యి ఎకరాలకు నేను ఎకరాకు 25 లక్షల చొప్పున నేను డబ్బు చెల్లిస్త .. ఆ భూమిని రైతులకు అప్ప చెప్పు. అభివృద్ధి కోసం కొంతమంది త్యాగాలు చేయకతప్పదని చెప్పే కేసీఆర్ తన మాటల్లో చిత్తశుద్ధి ఉంటే తన భూమిని రైతులకు త్యాగం చేయాలి. పాదయాత్రలో మా దృష్టికి వచ్చిన అన్ని అంశాలను అసెంబ్లీ లో సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతుంది. నేను పార్లమెంట్ లో మోదీ దృష్టికి తీసుకెళతా. రాబోయే 3 సంవత్సరాల్లో మా నినాదం జై కిసాన్ .. జై జవాన్. మేము చేయబోయే ఈ మహోద్యమం లో కలిసి నడిచేందుకు రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు బయటికి రావాలి. నిన్నటి రైతు రణభేరి మేము ఊహించిన దానికంటే ఎక్కువ రైతులు స్వాచ్చoదంగా తరలి వచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం నలుమూలల పాదయాత్రకు ఎఐసిసి అనుమతి తీసుకుంటా. రైతుల కోసం నేను చేసే పోరాటాలు రైతులకు మేలు జరుగుతుందా లేదా అన్నదే చూడాలి .. వాళ్ళు వచ్చారు .. వీళ్ళు రాలేదు అనే చిన్న చిన్న విషయాలను పెద్దది గా చూడవద్దు. ఇతర నాయకులు చేసే పాదయాత్ర లకు తప్పకుందా పాల్గొంటా. భట్టి చేస్తున్న రైతుల ముఖా ముఖి హాజరవుతా. కాంగ్రెస్ జెండా కిందా నాయకులు చేసే అన్ని కార్యక్రమాలు పార్టీ వే. ఇందులో వర్గాలుగా చూడటం సరికాదని అన్నారు. 

Related Posts