YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవి నుండి కిరణ్ బేడి తొలగింపు

పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవి నుండి కిరణ్ బేడి తొలగింపు

పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవి నుండి కిరణ్ బేడి తొలగింపు
    గవర్నర్ పదవితో తనకు జీవితకాలం అనుభవం వచ్చింది: కిరణ్ బేడి
       తొలగింపును స్వాగతించిన ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి
    ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై నియామకం 
పుదుచ్చేరి ఫిబ్రవరి 17 
’కేంద్ర పాలిత ప్రాంతంమైన  పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవి నుండి తనను తొలగించడం తనకు జీవితకాలం అనుభవం వచ్చిందని, ఈ అవకాశం ఇచ్చినందుకు కిరణ్ బేడి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ పదవి నుండి తనను  తొలగించడం పట్ల కిరణ్ బేడి స్పందించారు. పుదుచ్చేరి ప్రజలకు ప్రభుత్వ అధికారులందరికీ  లెఫ్టినెంట్ గవర్నర్గా నా ప్రయాణంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు అని 71 ఏళ్ల కిరణ్ బేడి బుధవారం ఉదయం ఒక ప్రకటనతో పాటు ట్వీట్ చేశారు. పుదుచ్చేరికి లెప్టినెంట్ గవర్నర్గా పనిచేస్తానని తాను ఊహించలేదని అలాంటి అవకాశం తనకు దక్కిందని అన్నారు.రాజ్నివాస్ టీం ప్రజా ప్రయోజనాలకు కృషి చేసిందని కిరణ్ బేడి చెప్పారు.ఏమైనా తన పవిత్ర విధిని నిర్వర్తించానని చెప్పారు. కిరణ్ బేడి లెఫ్టినెంట్ గవర్నరుగా చివరిసారిగా పుదుచ్చేరిలో కొవిడ్ టీకా డ్రైవ్ ను సమీక్షించారు. పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుల మేరకు కిరణ్ బేడి ఉద్వాసనకు గురయ్యారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజులుగా ఆరోపణలను చేస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఫిర్యాదు చేసింది. వాటిని ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకుంది
 కిరణ్ బేడి తొలగింపును ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. తమ మంత్రులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కిరణ్ బేడి ద్వారా బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆరోపణలను చేశారు. ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయడానికి కిరణ్ బేడి విశ్వ ప్రయత్నాలు చేశారంటూ ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నారాయణ స్వామి ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె పనితీరు అప్రజాస్వామికంగా ఉందంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 2019లో తిరిగి గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం ఎదుట నారాయణ స్వామి ధర్నాకు కూడా దిగారు.

Related Posts