YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమలానికి కష్టకాలం

కమలానికి కష్టకాలం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18, 
టీ అమ్ముకున్నోడు కదా అని ప్రజలు కష్టాలు తెలుస్తాయి అన భావించాం. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడతారని అందరూ అనుకున్నాం. పెళ్లయిన బ్రహ్మచారి కదా అని మమత, ప్రేమానురాగాలు తెలుస్తాయి అని ఊహించాం. కానీ మోదీ వీటన్నింటికి అతీతం అని నమ్మాం. కానీ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలు ఇవేమీ మోదీకి వర్తించవని తేలిపోయింది. ప్రజల కోసం పనిచేసే నేత కాదని తెలిసిపోయింది.గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినప్పడు దేశం కూడా ఆ రాష్ట్రం మాదిరి అభివృద్ధి చెందుతుందని దేశ వ్యాప్తంగా ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతరేక నిర్ణయాలనే తీసుకుంటున్నారు. ఆయన చేసే విదేశీ టూర్లు, వేసుకునే వస్త్ర ధారణ చూసి కార్పొరేట్ లతో కలసిి పోయారని చెప్పక తప్పదు.పెట్రోలు లీటరు వందరూపాయలకు చేరుతున్నా మోదీ పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యావసరాలు నింగినంటుతున్నా ప్రజల బాగోగులను పట్టించుకోవాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ భారీ డైలాగులుచెప్పడం తప్ప చేతలు మాత్రం శూన్యం. కనీసం కేంద్ర బడ్జెట్ లో సామాన్యులకు ఉపయోగపడే చర్యలు లేవు. అగ్రి సెస్స్ పేరుతో బాదుడుకే మోదీ పూనుకున్నారు. ఇక వంట గ్యాస్ ధరను కూడా పెంచేశారు. త్వరలో గ్యాస్ సిలిండర్ పై ఉన్న సబ్సిడీని కూడా ఎత్తివేస్తారని తెలుస్తోంది.ప్రజలు సెంటిమెంట్ గా భావించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రయివేటు పరం చేయడానికి మోదీ సిద్ధమవుతున్నారు.  ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరం చేసి ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి నరేంద్రమోదీ పూనుకున్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి సంస్థలను కూడా ప్రయివేటు పరం చేయడానికి సిద్ధమయ్యారు. అదానీ, అంబానీల ప్రయోజనం కోసమే మోదీ ప్రజల ఆస్తులను పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మోదీ పాలన కంటే మన్మోహన్ పాలన వెయ్యిరెట్లు మెరుగన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మోదీపై సాధారణ, మధ్యతరగతి ప్రజల్లో పూర్తిగా నమ్మకం సన్నగిల్లింది. మోదీ తన నిర్ణయాలతో పార్టీని పూర్తిగా పడకక్కించేందుకే సిద్ధమయ్యారు. వాజ్ పేయి హయాంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో మోదీ తన పాలనలో దేశాన్ని పూర్తిగా పడుకోబెట్టేశారన్నది వాస్తవం.

Related Posts