YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

బీసీల సంక్షేమంపై చర్చకు వైసీపీ సిద్ధమా? వైఎస్సార్ కాంగ్రెస్ కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్

బీసీల సంక్షేమంపై చర్చకు వైసీపీ సిద్ధమా?  వైఎస్సార్ కాంగ్రెస్ కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్

బీసీల సంక్షేమంపై చర్చకు వైసీపీ సిద్ధమా?అంటూ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ పెద్ద నాటకమని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీపై అవగాహన లేని వ్యక్తులే సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారని అన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీసీ వర్గాలను ఆదరించిన పార్టీ టీడీపీ అని మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు బీసీలు టీడీపీ వెంటే ఉన్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి ప్రముఖ శాఖలన్నీ బీసీలకే ఇచ్చారని, ఆదరణ పథకం ద్వారా కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Related Posts