YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఓట్ల చీలిక ఎవరికి లాభం

ఓట్ల చీలిక ఎవరికి లాభం

కోల్ కత్తా, ఫిబ్రవరి 18, 
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. సభలు, సమావేశాలతో బెంగాల్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభమయింది. ఇక్కడ పోటీ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ ఇది పైకి కన్పించే అంశమే. అనేక పార్టీలు రంగంలోకి దిగుతుండటంతో మమత బెనర్జీ విజయానికి గండ పడుతుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.పశ్చిమ బెంగాల్ లో 293 అసెంబ్లీ స్థానాలున్నాయి. 150 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఈ ఎన్నికల్లో రావన్నది సుస్పష్టం. అంటే మమత బెనర్జీకి మెజారిటీ అయినా తగ్గాలి. బీజేపీకి గణనీయంగా సీట్ల సంఖ్య పెరగాలి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇక్కడ 193 స్థానాల్లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ మరికొన్ని చిన్నా చితకా పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశ్యంలో ఉంది.ఆ కూటమి ఎంత బలపడితే తమకు అంత ప్రయోజనమని మమత బెనర్జీ భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ కూటమి చీల్చుకుంటే తమ గెలుపు సులువవుతుందని అనుకున్నారు. కానీ రోజురోజుకూ పరిస్థితిచూస్తుంటే చిన్న పార్టీలతోనే తమకు ముప్పు ఉన్నట్లు మమత బెనర్జీ గుర్తించారు. ఇప్పటికే 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనలో మమత బెనర్జీ ఉన్నారు. ఎంఐఎం పార్టీతో పాటు ఇండియన్ సెక్యులర్ పార్టీలు తనను దెబ్బతీస్తాయన్న ఆందోళనలో మమత బెనర్జీ ఉన్నారు.ఇక మరో 30 శాతం ఓట్లు ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లపై కూడా రోజురోజుకూ మమత బెనర్జీకి నమ్మకం సన్నగిల్లుతుంది. ఇక్కడ జేఎంఎం, ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, హిందూస్తానీ లెఫ్ట్ ఫ్రంట్, బీఎస్సీ, శివసేన, ఎస్సీ వంటి పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. కులాలు, సామాజిక వర్గాల వారీగా ఈ పార్టీలు ఓట్లు చీల్చుకుంటే మమత బెనర్జీ కి ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ పోటీ చేసినా ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం విశేషం. అయినా ఓట్ల చీలికలో వీటి పాత్రను కొట్టిపారేయలేం.

Related Posts