YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

న్యాయపోరాటానికి శశికళ

న్యాయపోరాటానికి శశికళ

చెన్నై, ఫిబ్రవరి 18, 
శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లేముందు శపథం చేశారు. గుర్తుండే ఉంటుంది. బయటకు ఆమె చెప్పకపోయినా తనను మోసం చేసిన వారిని వదిలపెట్టబోనని శశికళ నాడు శపథం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శశికళ వచ్చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత శశికళ పూర్తిగా తమిళనాడు రాజకీయాలపైనే దృష్టి సారించనున్నారు. ప్రధానంగా అన్నాడీఎంకేను తన నుంచి స్వాధీనం చేసుకున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం లను రాజకీయంగా పతనం చేయడం కోసమే నంటున్నారు.శశికళకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం కాదు. అన్నాడీఎంకే మాత్రం వారి చేతిలో ఉండగా గెలవకూడదు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలయితే ఆటోమేటిక్ గా తన చేతికి వచ్చేస్తుందన్నది శశికళ ఆలోచన. అదే అన్నాడీఎంకే గెలిస్తే తన పరపతి, ఇమేజ్ రెండూ పోయే ప్రమాదముంది. అందుకే ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవకుండానే శశికళ ప్రతి అడుగూ వేస్తారంటున్నారు.
ముందుగా న్యాయపరంగా అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గుర్తు కోసం శశికళ న్యాయపోరాటం చేస్తారు. తనను అక్రమంగా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంపైన కూడా శశికళ సుప్రీంకోర్టునుఆశ్రయించనున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదంటున్నారు. ఇలా తొలుత శశికళ అన్నాడీఎంకే నేతలు పళినిస్వామి, పన్నీర్ సెల్వంలకు ఎన్నికల వేళ చికాకు పుట్టించనున్నారు.తనకు అనుకూలంగా తీర్పులు రాకున్నా శశికళ ఎన్నికల్లో మాత్రం దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని ఒంటరిగా అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తుంది. ముఖ్యంగా అన్నాడీఎంకే అభ్యర్థులు ఉన్నచోటనే ఎక్కవగా శశికళ దృష్టి పెట్టనున్నారు. దీంతో అన్నాడీఎంకే ను ఎన్నికలలో నష్టపరిచి పార్టీని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలన్న యోచనలో శశికళ ఉన్నారు. ఓటమి పాలయిన వెంటనే అన్నాడీఎంకే నుంచి నేతలందరూ పళని, పన్నీర్ ను వదలి తన చెంతకు చేరతారన్న నమ్మకంతో శశికళ ఉన్నారు.

Related Posts