YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తాడిపత్రిలో రచ్చరచ్చ

తాడిపత్రిలో రచ్చరచ్చ

అనంతపురం, ఫిబ్రవరి 18, 
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరు నేతల మధ్య వైరంతో ఈ నియోజకవర్గంలో పరిస్థితులు భయంకరంగా మారాయి. మరోవైపు కొన్ని మండలాల్లో వైసీపీ వర్సెస్ రెబల్స్ తో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తుంది. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు ఒక వైపు వైసీపీలో రెబల్స్ గోల మరో వైపు తాడిపత్రి రాజకీయం అనంత జిల్లాలో ఆసక్తిరేపుతుంది.అనంతపురం జిల్లాలో జరుగుతున్న పంచాయతీ పోరులో అసలు సిసలైన ఘట్టం వచ్చేసింది. జిల్లాలో అత్యంత సమస్యాత్మకమైన తాడిపత్రిలో పంచాయతీ పోరు ఆసక్తిరేపుతుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలే పెద్ద సమస్యాత్మకంగా ఉన్న తాడిపత్రి రూరల్ ప్రాంతంలో ఇప్పుడు పల్లె పోరు అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ రాళ్ల దాడులు జరుగుతాయి… ఎప్పుడు ఎవరి మీద అటాక్ జరుగుతుందో అన్న టెన్షన్ ఎన్నికల వేళ కనిపిస్తుంది.నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎక్కువ సంఖ్యలో పంచాయతీలు గెలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాడిపత్రితో పాటు శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు, పుట్లూరు మండలాలు కూడా సెన్సిటీవ్ గా మారాయి. టీడీపీ పెద్దగా పోటీలో లేకపోయినా..వైసీపీలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం, భోగతి వర్గం ఇరువురు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ వైసీపీ వారే అయినా.. రెబల్స్ గా దిగి పట్టు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు…ఈ పోరులో ఒక్క తాడిపత్రి మినహాయిస్తే.. మిగిలిన అన్ని మండలాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అనేకన్నా.. వైసీపీ వర్సెస్ రెబల్స్ అన్న రేంజ్ లో పోరు జరుగుతోంది.

Related Posts