YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరిషత్ పై తేల్చుకోలేకపోతున్న ఎస్ఈసీ

పరిషత్ పై తేల్చుకోలేకపోతున్న ఎస్ఈసీ

విజయవాడ, ఫిబ్రవరి 18, 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పై ఏపీ ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతోంది. ఎందుకంటే ఆగిన చోట నుంచే ప్రక్రియను కొనసాగిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరింది. కానీ అలా చేస్తే ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎస్ఈసీ సమాలోచనలు చేస్తోంది. తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలపై ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. దీనికి ప్రస్తుతం మూడు అషన్లు పరిశీలిస్తోంది. ఆప్షన్‌-1: ఆగిన చోట నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం, ఆప్షన్‌-2: కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయడం, ఆప్షన్‌-3: ఈ ఎన్నికల నిర్వహణను కొత్త ఎస్‌ఈసీకి వదిలేయడం.ఇక మూడు ఆప్షన్లను పరిశీలిస్తోన్న ఎస్‌ఈసీ కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే.. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే భావనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని గతంలో ప్రకటించడంతో కొత్త నోటిఫికేషన్‌ జారీకి ఇబ్బందులు ఉండొచ్చనే భావన వ్యక్తం అవుతోంది. కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే ఎస్‌ఈసీ గతంలో చేసిన ప్రకటనను చూపుతూ ప్రభుత్వం కోర్టుకెళ్లే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల విషయంలో కూడా పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించాలనుకుంటే… ఆ అంశం అడ్డంకి కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటమే దీనికి ఉదాహరణ. అయితే… పరిషత్ ఎన్నికలను కూడా… నిమ్మగడ్డ ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడ్నుంచే ప్రారంభిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాడులు, దౌర్జన్యాలతో అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు అయ్యాయని… స్వయంగా నిమ్మగడ్డ. లెక్కలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వాటిని ఆయన కొనసాగిస్తే.. విధి నిర్వహణలో ఆయన రాజీ పడినట్లుగా అవుతుంది. అందుకే ఆసక్తి ఏర్పడింది. కొత్త నోటిఫికేషన్ ఇస్తే న్యాయపరంగా ఏమైనా చిక్కులు వస్తాయా అన్నదానిపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 31న నిమ్మగడ్డ రిటైర్ అవుతున్నారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వదల్చుకుంటే.. మార్చి పధ్నాలుగోతేదీన ఇస్తే… ఆయన పదవి కాలం పూర్తయ్యే లోపు ఎన్నికలు నిర్వహించవచ్చు. లేకపోతే… ఎన్నికలప్రక్రియ మధ్యలో ఆయన రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ ఏంచేస్తారన్నది ఇప్పుడు అటు వైసీపీ.. ఇటు టీడీపీ నేతల్లోనూ ఆసక్తి రేపుతోంది.
మున్సిపల్ పై నిఘా
ఏపీ మునిసిపల్ ఎన్నికల సమయాన నిమ్మగడ్డ మళ్ళీ కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లోని సింగిల్ నామినేషన్లపై నిమ్మగడ్డ ఫోకస్ పెట్టారు. గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని ఆరు మున్సిపాల్టీల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంపై కలెక్టర్ల నుంచి నిమ్మగడ్డ నివేదిక కోరారు. ఈ నెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.సీఎం సొంత నియోజకవర్దం పులివెందుల సహా రాయచోటి, మాచర్ల, పుంగనూరు, పలమనేరు,  తిరుపతి కార్పోరేషన్లల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలయ్యాయి. పులివెందుల, రాటచోటిల్లో 21 వార్డుల్లో, పుంగనూరులో 16, పలమనేరు, మాచర్లల్లో చెరో పది వార్డుల్లో సింగిల్ నామినేషన్ల దాఖలయ్యాయి. ఇవేకాక తిరుపతి కార్పోరేషన్లోని 6 డివిజన్లల్లో సింగిల్ నామినేషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాక దీనికి సంబంధించి ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.

Related Posts