YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పంచాయతీల్లో బెదిరింపులు

పంచాయతీల్లో బెదిరింపులు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 18, 
పంచాయతీ ఎన్నికల వేళ వైసీపీ నేతలు బెదిరింపులు సంచలనంగా మారుతున్నాయి.  శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం బడివానిపేటలో వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ మొదలవలస చిరంజీవి బెదిరింపుల వీడియో సంచలనంగా మారింది. టీడీపీ మద్దతుదారుడికి ఓటేయవద్దంటూ గ్రామస్తులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం మనదైనప్పుడు వాడు గెలిచి ఏం చేస్తాడు ? టీడీపీ మద్దతుదారుడు గెలిచినా…రెండు నెలల్లో వాడికి చెక్ పవర్ తీసేస్తాం ! అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎచ్చెర్ల మండల ఎంపీపీని నేనే ..ఎమ్మెల్యే నన్నే డిక్లేర్ చేశారని, మనం చేతకానివాళ్లం కాదని కార్యకర్తలు గ్రామ ప్రజలకు చెప్పండని ఆయన అన్నారు.జగన్ అక్కడ స్విచ్ నొక్కేస్తున్నాడు..ఇక్కడి నాయకుల ఏమీ చేస్తారనుకోకండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఆపాలో నాకు తెలుసని ఆయన అన్నారు. ఫరీద్ పేటలో 45 పెన్షన్లు తీసేశా…ఒక్కడు మాట్లాడలేదు, వైసీపీ మద్దతుదారుడు తాతారావుకు ఓటేయని వారికి వచ్చే అన్ని పథకాలు ఆపేస్తాం అంటూ ఆయన హెచ్చరించారు. అమ్మ ఒడి ,రుణమాఫి , భరోసా , మత్స్యకారులకు వచ్చే బెనిఫిట్స్ ఏవీ రావు…నేనురానివ్వనని ఆయన అన్నారు. టీడీపీ మద్దతుదారుడి తరపున ఎవరైనా ఉంటే మరోసారి ఆలోచించుకోండి, టీడీపీ మద్దతుదారుడు ప్రెసిడెంట్ గా గెలిచినా… రెండునెలల కంటే ఎక్కువ ఉండడని అన్నారు. ప్రతీ ఇంటికీ వచ్చే సంక్షేమాన్ని ఆపేస్తాం…ఉన్నవి తీసేస్తాం, తాతారావుకు కాకుండా టీడీపీ మద్దతుదారుడికి ఓటేస్తే 21వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తానని అంటూ ఆయన హెచ్చరించారు.

Related Posts