YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ లో చతుర్ముఖ పోటీ

సాగర్ లో చతుర్ముఖ పోటీ

నల్గొండ, ఫిబ్రవరి 18, 
సాగ‌ర్ ఎన్నిక‌లు సాగ‌ర్ ఎన్నిక‌లు అని వినీ వినీ చ‌స్తున్నాం. ఎప్పుడు పెడ‌తారో తెలీదు కానీ.. లీడ‌ర్లు మాత్రం.. పాలిటిక్స్ లో బిజీ బిజీ అయిపోయారు. అటు తిరుప‌తి ఎన్నిక‌లు కూడా అంతే. అవి అలా ఉండ‌గానే.. ఏపీ మొత్తం ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌య్. ఇక ఇక్క‌డ కూడా అంతే.. సాగ‌ర్ పోరు గురించి వింటున్న టైంలో.. గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రిగాయి.. రిజ‌ల్ట్ వ‌చ్చాయి.. మేయ‌ర్ ఎన్నిక కూడా అయిపోయింది. ఆమెకు హైకోర్టు నుంచి వార్నింగులు రావ‌డం.. ప‌నుల్లో బిజీ అయిపోవ‌డం అన్నీ జ‌రుగుతున్న‌య్.ఇక సాగ‌ర్ ఎన్నిక షెడ్యూల్ మాత్రం రావ‌డం లేదు. కానీ.. ఈనెల వచ్చే నెలా అంటూ.. బిజీ బిజీగా ఉన్నారు లీడ‌ర్లు. ఎందుకంటే.. షెడ్యూల్ వ‌చ్చేస్తే.. ల‌గ్గానికి ముహూర్తాలు పెట్టిన‌ట్లే ఉంటుంది. ల‌గ్గాల మీద కూర్చుంటే ఎప్పుడు మంచి ముహూర్తం ఉంటే అప్పుడు పెట్టేయాలి.. హ‌డావిడిగా ప‌నులు చేయాలి క‌దా. ఇదీ అంతే. నోటిఫికేష‌న్ వ‌చ్చిందంటే ప్ర‌చారం చేసే టైం కూడా ఉండ‌దు. అందుకే.. పార్టీలు అన్నీ ముందు నుంచే ప్లాన్స్ లో ఉంటాయి.
ఇక‌పోతే.. సాగ‌ర్ ఎన్నిక టైం కూడా ద‌గ్గ‌రికే వ‌చ్చిన‌ట్లుంది. ఎందుకంటే.. టీడీపీ కూడా బ‌రిలోకి దిగింది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న టీడీపీ రంగంలోకి దిగింది. ఇప్ప‌టి  దాకా.. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు మాత్ర‌మే పొలిటిక‌ల్ గా వినిపించాయి. కానీ.. టీడీపీ మాత్రం సైలెంట్ గా ఉంది. కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి గెలుపు క‌చ్చితం అనుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఒకానొక ద‌శ‌లో లైట్ తీసుకుంద‌నే అనుకున్నారు. ఇక బీజేపీ పెద్ద‌గా హ‌డావిడి ఏం చేయ‌డం లేదు.
కాక‌పోతే.. ఇక పై మాత్రం అలా కుద‌ర్దు. ఎన్నిక‌ల టైం ద‌గ్గ‌రికొస్తుంది  క‌దా.. అందుకే.. అన్ని పార్టీలూ రంగంలోకి  దిగుతున్నాయి. ఇక టీడీపీ కూడా సై అన‌డంతో.. ఫైట్ ఇంకాస్త టైట్ అయింది. అయితే.. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఖ‌రారు అయ్యారు కానీ.. టీఆర్ఎస్ బీజేపీ లు మాత్రం క్లారిటీగా లేవు. బ‌ట్.. చంద్ర‌బాబు స్పెష‌ల్ క‌దా.. లేట్ గా వ‌చ్చినా లేటెస్ట్ గా అన్న‌ట్లు.. మువ్వా అరుణ్ కుమార్ అని క్లారిటీతో ఉంది టీడీపీ. ఇక ఫైటింగే నెక్స్ట్.

Related Posts