ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు పడనున్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ అధికారులు సూచించారు.మరోవైపు విశాఖ జిల్లా పాడేరు, అరకులో ఉరుములతో కూడిన భారీవర్షం కురుస్తోంది. అండమాన్ నుంచి భారత్ తీరంపై భారీ అలలు దూసుకొస్తున్నాయని, ఈ నెల 26 వరకు సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగాఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు పడనున్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ అధికారులు సూచించారు.మరోవైపు విశాఖ జిల్లా పాడేరు, అరకులో ఉరుములతో కూడిన భారీవర్షం కురుస్తోంది. అండమాన్ నుంచి భారత్ తీరంపై భారీ అలలు దూసుకొస్తున్నాయని, ఈ నెల 26 వరకు సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగాఉండాలని అధికారులు సూచించారు.