YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో: రైతు సంఘాల పిలుపు

18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో: రైతు సంఘాల పిలుపు

న్యూఢిల్లీ ఫిబ్రవరి 18,
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రతరమవుతోంది. తమ డిమాండ్లకు మద్దతుగా ఈనెల 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దేశవ్యాప్తంగా రైల్‌ రోకోను చేపడతామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ బుధవారం వెల్లడించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు  రైల్‌ రోకో ఆందోళన్‌ను తమ ప్రాంతాల్లో నిర్వహిస్తారని చెప్పారు.మరోవైపు రైతులు రైల్‌ రోకో ఆందోళన తలపెట్టడంతో ప్రధానంగా పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లో ముందుజాగ్రత్తగా రైల్వేలు 20 అదనపు రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) కంపెనీలను రప్పించాయి. రైల్‌ రోకో నేపథ్యంలో నిరసనకారులు సంయమనంతో వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. రైతుల ఆందోళనను పురస్కరించుకుని తాము జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షిస్తామని చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్ధితి అదుపులో ఉండేందుకు అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు.

Related Posts