YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్

నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్

నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ ఉద్యోగాల భర్తీ లేదు, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు లేవు సీఎం కేసీఆర్ పై జీవన్ రెడ్డి  ఫైర్
నిరుపేదల సంక్షేమాన్ని సీఎం  కేసీఆర్ విస్మరించారని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జగిత్యాలలోని  ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. రెండవ పర్యాయం మొదటి పర్యమం కన్నా మెరుగైన పాలన  ఉంటుందని భావించిన ప్రజలకు దానికి భిన్నంగా అన్నివర్గాల ప్రజలను నిరాశపర్చేవిధంగా కొనసాగటం బాధాకరమన్నారు. నిరుపేదవర్గాలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హత కల్గించే  రేషన్ కార్డులు రెండేళ్లలో ఒక్కటి జారీ చేయలేదని ఆరోపించారు.ఆసరా పెన్షన్ గతంలో మంజూరైన వాళ్లకు ఇంకా ఇవ్వలేదని, ఎన్నికల్లో వాగ్దానం చేసిన వయే పరిమితి 57 ఏళ్ళు తగ్గించిన ఇప్పటికి  రాష్ట్రంలో ఒక్కరికి  ఏ రకమైన పింఛన్  మంజూరు కాలేదని మండిపడ్డారు.రాష్ట్రంలో నిరుపేద వర్గాల సంక్షేమం ఏవిధంగా జరుగుతుందో ఒక్కసారి పరిశీలించాలని కెసిఆర్ కు  సూచించారు.తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత కొత్త ఉద్యోగాలు భర్తీకాదుకదా  ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయడం లేదని పేర్కొంటూ రాష్టంలో లక్షల తొంభై ఒకటి వేళా ఉద్యగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. నిరుద్యోగ  యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్ దాని ప్రతిపాదన ఇంకా మొదలు కాలేదని విమర్శించారు.రైతులకు రుణమాఫీ పై ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పష్టత లేదని, పంట రుణాలపై  వడ్డీ రాయితీ తొలగించడంతో  రైతులు అప్పులఊబిలోకూరుకుపోయారన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత నిజం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తోందని భావిస్తే  కానీ నిజం షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడిందని  దీంతో రైతులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని తెలిపారు. పండ్ల తోటల పెంపకానికి  సూచనలిచ్చే తెలంగాణ లో హార్టికల్చర్ విభాగం ఉద్యోగులను జీతాలు చెల్లించలేక అకారణంగా తొలగించారని ఇది దేశంలో ఎక్కడ జరుగలేదన్నారు. దీంతో హార్టికల్చర్ విభాగం కేసీఆర్ పుణ్యమాని  కనుమరుగై అయిందని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకనుగుణంగా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సి ఉండంగా రెండున్నరేళ్లు గడిచిన దాని ఉసెత్తకపోవడం భాధాకరమని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన పాత్ర జాతీయ ఉపాధిహామీ పథకమని పేర్కొంటూ అందులోపనిచేస్తున్న 40 వేల మంది  దళిత ఫీల్డ్ అసిస్టెంట్లను అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం దారుణమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నిర్బంధసాగు నెపంతో సన్నరకాల వరిసాగుచేసిన  రైతులు ఎకరానికి 10 వేలు నష్టపోయారని ఎలాంటి పరిహారం అందించకపోవడం బాధాకరమన్నారు.పాఠశాలల్లో కేవలం 2500 రూపాయల జీతంతో పనిచేసి దళితుల స్వీపర్లకు   ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగిస్తారా అని ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్యమ నేతగా నేను గౌరవిస్తాను కాని  ఉద్యమ ఆకాంక్షలను నిరుకార్చడం క్షమించరానిదన్నారు. ముస్లింలకు మైనార్టీలకు 12 శాతం, ఎస్టీ లకు 4శాతం  రిజర్వేషనన్లు  అన్న కేసీఆర్ వాటిని మర్చిపోయారని ఎద్దేవాచేశారు.. కేవలం మొక్కలు నాటడం కాదు వాటిని సంరక్షించాలని, గ్రామాల్లో పండ్ల మొక్కలునాటి  ముదిరాజులకిస్తే  వారికీ ఉపాధిలభిస్తుందన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు కోటి మొక్కలు నాటుతున్నారు నాటిన మొక్కల్లో ఎన్ని మొక్కలను కాపాడుతారో, మొక్కలను జియోట్యాగింగ్ చేయాలనీ కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదన్నారు. సామాజిక దృక్పధంతో ఉద్యమ ఆకాంక్ష నెరేవేర్చే విధంగా  కేసీఆర్ ఆలోచనలో ఇప్పటినుంచైనా మార్పు రావాలని  కోరుతున్నానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సామజిక తెలంగాణ దిశగా ముందుకు రావాలని కేసీఆర్ ను కోరారు.  సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు  బండ శంకర్, దేవేందర్ రెడ్డి, గుంటి జగదీశ్వర్, బండ భాస్కర్ రెడ్డి, గుండా మధు, నందయ్య, జున్ను రాజేందర్, గంగయ్య, చందా రాధాకిషన్, అశోక్, పోత్నుక మహేష్, రియాజి, రమెష్, మహిపాల్, చాందుపాషా తదితరులు పాల్గొన్నారు.

Related Posts