హైదరాబాద్ ఫిబ్రవరి 18,
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారిగా బంగారం పట్టుబడింది. బంగారాన్ని పొడిగా మార్చి జీన్స్ పాంట్ నడుము భాగంలో అమర్చుకుని తరలించేందుకు నిందితులు ప్రయత్నించారు. బంగారం రవాణాపై సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు వారి కదలికల అధారంగా తనిఖీలు జరిపి బంగారాన్ని గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చని విమానంలో ఎక్కిన ఇద్దరు ప్రయాణికులు అక్కడ నుండి బంగారాన్ని తీసుకుని నడుము భాగంలోని జీన్స్ పైంట్ అమర్చుకుని హైదరాబాద్ వచ్చారు.వారి వద్ద లభించిన బంగారం 1.4 కిలోలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. దాని విలుల బహిరంగ మార్కేట్ లో 69.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై అక్రమ రవాణా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు