YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 వైసీపీ మేయర్ అభ్యర్ధి చెప్మా... 

 వైసీపీ మేయర్ అభ్యర్ధి చెప్మా... 

 వైసీపీ మేయర్ అభ్యర్ధి చెప్మా... 
విజయవాడ, ఫిబ్రవరి 19,
విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠాన్ని మ‌హిళ‌కు కేటాయించారు. ప్రస్తుతం గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే వెనువెంట‌నే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమ‌వుతోంది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కూడా స్పష్టం చేశారు. ఎక్క‌డా క‌నీసం గ్యాప్ లేకుండానే ఈ ఎన్నిక‌లు నిర్వహిస్తున్నారు. ఇవి కూడా మార్చి 10 లోపు నిర్వహిస్తార‌ని స‌మాచారం. ఇక‌, ఇవి పూర్తికాగానే వెంట‌నే మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్లకు కూడా ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమ‌వుతోంది. నిజానికి ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌తోపాటే.. వీటిని కూడా నిర్వహిస్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఏదేమైనా.. మార్చిలోనే మునిసిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కూడా పూర్తిచేసి.. త‌న హ‌యాంలోనే మొత్తం స్థానిక ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని నిమ్మగడ్డ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.ఈ క్రమంలోనే కీల‌క‌మైన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. రాజ‌ధాని మార్పు నేప‌థ్యంలో టీడీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతుంద‌నే రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ల‌లో కూడా వైసీపీకి గెలుపు అంత వీజీ కాదంటున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ‌ను తీసుకుంటే.. ఇక్కడ‌.. టీడీపీకి మేయ‌ర్ అభ్యర్థులు ముగ్గురు బ‌రిలో ఉన్నారు. ఇప్పటికే ఒక‌రికి చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ఒక‌వేళ ఆయ‌న మ‌న‌సు మారుతుందేమో.. త‌మ‌కు కూడా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని మిగిలిన ఇద్దరు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎంపీ కేశినేని ఇప్పటికే చాలా అల‌క‌తో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న కుమార్తె కేశినేని శ్వేత‌కు దాదాపు టీడీపీ మేయ‌ర్ అభ్యర్థిత్వం ఖ‌రారైన‌ట్టే అంటున్నారు. అటు తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ త‌న వ‌ర్గానికి… ఇటు సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వర‌రావు త‌న వ‌ర్గానికి మేయ‌ర్ పద‌వి ఇప్పించుకునేందుకు ఛాన్స్ కోసం కాచుకుని ఉన్నారు.స‌రే.. ఈ విష‌యం అలా ఉంచితే.. అధికార పార్టీ వైసీపీ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. విజ‌య‌వాడ‌లో మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునే వైసీపీ నాయకురాలు ఎవ‌రూ ఇప్పటి వ‌ర‌కు ముందుకు రాలేదు. క‌నీసం పేరుకూడా వినిపించ‌డం లేదు. సెంట్రల్ లో ఎమ్మెల్యేగా ఉన్న మ‌ల్లాది విష్ణు .. ఏపీ బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్‌గా ఉన్నారు. అటు ప‌శ్చిమ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. వీరిద్దరు కూడా మేయ‌ర్ విషయంలో దూకుడుగా లేరు. అయితే.. చూచాయ‌గా అందుతున్న స‌మాచారం మేర‌కు.. ప్రస్తుతం న‌గ‌ర పార్టీ బాధ్యత‌లు చూస్తున్న బొప్పన భ‌వ‌కుమార్ స‌తీమ‌ణిని పోటీలో పెట్టాల‌ని భావిస్తున్నారు.వెల్లంప‌ల్లికి ఆశ ఉన్నా ఆయ‌న ఇప్పటికే మంత్రిగా ఉండ‌డంతో ఆయన వ‌ర్గానికి మేయ‌ర్ ఇవ్వరనే అంటున్నారు. తూర్పు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్ సైతం ఇక్కడ పార్టీ బ‌ల‌ప‌డాలంటే త‌న వ‌ర్గానికి మేయ‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని నేరుగా వైవి. సుబ్బారెడ్డికే రిక్వెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. ఇప్పటి వ‌ర‌కు విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠానికి సంబంధించి వైసీపీలో ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Related Posts