YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నారాయణ...నారాయణ

నారాయణ...నారాయణ

నారాయణ...నారాయణ
నెల్లూరు, ఫిబ్రవరి 19, 
మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ గుర్తున్నారా ? ఆశ్చర్యంగా అనిపించినా.. రాజ‌కీయ నేత‌లు ఇప్పుడు ఇలానే ఆయ‌న గురించి చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత అంటే దాదాపు 20 నెల‌లుగా ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు ఎక్కడా క‌నీసం ఎవ‌రికీ ముఖం కూడా చూపించ‌లేదు. గ‌తంలో చంద్రబాబు పాల‌న‌లో అంతా తానై వ్యవ‌హ‌రించారు. రాజ‌ధానిని ఒంటి చేత్తో న‌డిపించారు. ప్లాన్లనీ, చ‌ర్చల‌నీ.. నిత్యం ఆయ‌న హ‌డావుడి అంతా ఇంతా కాదు. చద్ర‌బాబు ఏ విదేశీ ప‌ర్యట‌న‌కు వెళ్లినా ఆయ‌న కూడా నారాయ‌ణ త‌ప్పనిస‌రిగా ఉండాల్సిందే..! అలాంటి నాయ‌కుడు ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ఊసు కానీ.. ఆయ‌న ధ్యాస‌కానీ.. ఎక్కడా వినిపించ‌డం లేదు.అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పొంగూరు నారాయ‌ణ నేరుగా మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు పాల‌న‌లో మంత్రిగా చ‌క్రం తిప్పారు. అటు అత్యంత ప్రతిష్టాత్మ‌క‌మైన సీఆర్డీయే చైర్మన్ ప‌ద‌వి కూడా ఆయ‌న‌కే క‌ట్టబెట్టడంతో ఆయ‌న తిరుగులేని అధికారం అనుభ‌వించారు. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆయ‌న వియ్యంకుడు గంటా శ్రీనివాస‌రావుతో క‌లిసి రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌ని భావించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ ముందు నారాయ‌ణ చేతులు ఎత్తేశారు.ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌ర్వసాధార‌ణమే అయిన‌ప్పటికీ.. అప్పటి నుంచి క‌నీసం మీడియాలోనూ ఆయ‌న క‌నిపించ‌డం లేదు. పైగా గ‌త ఎన్నికల్లో ఆయ‌న సిటీలో గెలిస్తే త‌మ రాజ‌కీయానికి ఎక్కడ ఎస‌రు వ‌స్తుందో ? అని సొంత పార్టీ నేత‌లే ఆయ‌న్ను ఓడించార‌న్న నివేదిక‌లు ఆయ‌న వ‌ద్దకు వెళ్లాయి. ఆయ‌న తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌వ్వడం మిన‌హా చేసేదేం లేదు. చివ‌ర‌కు పార్టీ కార్యక్రమాలను కూడా వ‌దిలేయ‌డంతో చంద్రబాబు నెల్లూరు సిటీకి కొత్త ఇన్‌చార్జ్‌ను కూడా ప్రక‌టించేశారు. ఇప్పుడు నారాయ‌ణ‌కు నియోజ‌క‌వ‌ర్గం అంటూ కూడా లేకుండా పోయింది. కొన్నాళ్ల కింద‌ట అసెంబ్లీలో రాజ‌ధాని భూముల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు మంత్రి నారాయ‌ణ విష‌యం ప్రస్థావ‌న‌కు వ‌చ్చింది. అప్పుడు కూడా ఆయ‌న నోరు విప్పలేదు. క‌ట్ చేస్తే.. రాజ‌కీయాల‌కు ఆయ‌న దాదాపు స్వస్థి చెప్పార‌నే అంటున్నారు.
ఇప్పట్లో రాష్ట్రంలో ఎన్నిక‌లు లేవు. మ‌రో మూడేళ్ల వ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయంగా పుంజుకోవాలంటే.. స‌మ‌యం ప‌డుతుంది. సో.. ఇప్పట్లో రాజ‌కీయాల‌కు నారాయ‌ణ దూర‌మ‌నే భావించాలి. ఇక‌, విద్యావ్యాపారం చూసుకుంటున్నార‌ని అనుకున్నా.. జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. తీవ్రమైన ఇబ్బందుల్లో విద్యా సంస్థలు కూరుకుపోయార‌ని తెలుస్తోంది. పైగా క‌రోనా ఎఫెక్ట్ మ‌రింత‌గా ప్రభావం చూపించింద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మొత్తంగా.. చూస్తే పాలిటిక్స్ కు దూరం.. వ్యాపారంలో ఇబ్బందుల్లో.. ఉన్న మాజీ మంత్రి నారాయ‌ణ‌ ప‌రిస్థితి క‌క్కలేక‌.. మింగ‌లేక .. అన్నట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related Posts