YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 పుదుచ్చేరిలో మారుతున్న పరిణామాలు

 పుదుచ్చేరిలో మారుతున్న పరిణామాలు

 పుదుచ్చేరిలో మారుతున్న పరిణామాలు
పాండిచ్చేరి, ఫిబ్రవరి 19, 
పుదుచ్చేరి పాలిటిక్స్ హీటెక్కాయి.  అదనపు గవర్నర్ గా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే ఆమెను విపక్ష ఎమ్మెల్యేలు కలిసే అవకాశం ఉందని అంటున్నారు. అలానే ఆ వెంటనే బలపరీక్షకి ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరనున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలో ఎన్నికలు జరగబోయే పుదుచ్చేరికి కిరణ్ బేడీ ప్లేస్ లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తమిళిసై అయితేనే కరెక్ట్ అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు భావించి ఆమెను అక్కడికి పంపారని అంటున్నారు.అసలు మామూలుగా గవర్నర్ పోస్ట్ ఖాళీ అయితే ఆ పక్కన ఉన్న రాష్ట్ర గవర్నర్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం ఇప్పటి దాకా ఆనవాయితీగా వస్తోంది. కానీ పుదుచ్చేరి విషయంలో మాత్రం పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు గవర్నర్ లను కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. తమిళిసైని పుదుచ్చేరికి పూర్తి స్థాయి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా చేసి.. తెలంగాణకు కిరణ్ బేడీని గవర్నర్ గా పంపే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్న్నారు.  మ్మెల్యేల రాజీనామాలతో పుదుచ్చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధం కావాలని తెలిపారు. దీనికోసం ఈనెల 22వ తేదీన పుదుచ్చేరి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఇటీవల లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడిని తొలగించి తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు పార్టీలకు ఎమ్మెల్యేలు సమానంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి భవితవ్యం సోమవారం తేలనుంది. 30 మంది సభ్యులున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నలుగురి రాజీనామాలతో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 28కి చేరింది. గతంలో మంత్రి నమశివ్వాయం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తెపైంతన్‌తో మరో ఇద్దరు రాజీనామాలు చేశారు. వీరందరి రాజీనామాతో ప్రస్తుతం ప్రభుత్వానికి 14 మంది (కాంగ్రెస్‌ 10, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. దీనికి సమానంగా ప్రతిపక్షాల బలం 14 (ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Related Posts