YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

అవాంతరాలు అధిగమిస్తే అభివృద్ధే

అవాంతరాలు అధిగమిస్తే అభివృద్ధే
భద్రాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు కొలువైన ఈ ప్రాంతాన్ని దక్షిణ అయోధ్యగానూ కొందరు అభివర్ణిస్తారు. ఇదిలాఉంటే భద్రాద్రిని కార్పోరేషన్ గా మలచాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. పురపాలిక అర్హత వస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి మరింతగా జోరందుకుంటుందని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. భద్రాద్రిని టెంపుల్ సిటీగా చేయాలన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఏదేమైనా హోదా వస్తే ఆలయ ఆధారిత అభివృద్ధి వేగవంతమవుతుందని అంతా అంటున్నారు. టెంపుల్‌ సిటీ నిబంధనలున్న తితిదే, శ్రీశైలం వంటి క్షేత్రాల వద్ద ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలంటే పెద్దగా సమస్యలు ఉండవు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా పనుల్లో సత్వరమే చేసేస్తుంటారు. ఇదే పద్ధతి భద్రాచలంలో అమలైతే ఆలయ పరిసరాల్లో అభివృద్ధి నెలకొంటుందని స్థానికులు చెప్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా భద్రాద్రిని పూర్తిస్థాయిలో టెంపుల్‌ సిటీ చేయాలంటే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. వీటిని పరిష్కరించుకోగలిగితే టెంపుల్‌ సిటీ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం ఖాయమని చెప్తున్నారు. భద్రాద్రికి ప్రభుత్వం మున్సిపాలిటీ హోదా కల్పించడంతో పాటూ ఆలయ నగరంగా ప్రకటిస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకుంటాయి. రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చేసుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో చేపట్టే పనులకు కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని చెప్తున్నారు. భద్రాచలాన్ని పురపాలకంగా చేయడానికి అన్ని అర్హతలున్నాయి. నీరు, అడవులు లాంటి సహజ వనరులు భద్రాద్రిలో పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ చారిత్రక ప్రాంతం అభివృద్ధి పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఈ విషయం గుర్తించిన సర్కార్ భద్రాద్రిని మున్సిపాలిటిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గవర్నర్‌ వద్దకు ప్రతిపాదనలు సైతం పంపారు. అర్హత ఉన్న మిగతా ప్రాంతాలను కూడా పురపాలికలుగా మార్చే పనిలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. భద్రాచలం మన్యంలో ఉండడంతో గిరిజన చట్టాలకు విఘాతం లేకుండా నిర్ణయం తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంచేసి భద్రాద్రిని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

Related Posts