YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

న్యాయవాదుల అందోళనలు, నిరసనలు

న్యాయవాదుల అందోళనలు, నిరసనలు

న్యాయవాదుల అందోళనలు, నిరసనలు
హైదరాబాద్ ఫిబ్రవరి 19, 
న్యాయవాదులు వామన్ రావు, నాగమణిల హత్యలకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు.  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నారు.  నాంపల్లి, సికింద్రాబాద్, కూకట్పల్లి కోర్టుల్లో విధుల బహిష్కరణ చేసి ఆందోళన చేపట్టారు.  నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మల్కాజ్గిరి కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.  రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు.  ఉప్పర్పల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. 
సికింద్రాబాద్ సివిల్ కోర్టు న్యాయవాదులు ధర్నా చేపట్టారు.  దోషులను కఠినంగా శిక్షించాలంటూ న్యాయవాదులు డిమాండ్ చేశారు.  తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని ఆరోపించారు.  రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు సైతం న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదుల హత్యను ఖండిస్తూ మంథనిలో బంద్ ప్రకటించారు.  అఖిలపక్షం ఆధ్వర్యంలో మంథనిలో నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు.  మంథనిలో దుకాణాలను అఖిల పక్ష నేతలు మూసివేయించారు. అఖిలపక్ష బంద్లో ఎమ్మెల్యే శ్రీధర్బాబు పాల్గొన్నారు.  బంద్ కారణంగా మంథనిలో భారీగా పోలీసులు మోహరించారు.

Related Posts