యోగా ద్వారానే మనిషికి మనశ్శాంతి ఆరోగ్యం
యోగ మిత్ర మండలి
నెల్లూరు ఫిబ్రవరి 19
మనశ్శాంతి ఆరోగ్యం క లిగించేదే యోగా అని యోగా మిత్ర మండలి అధ్యక్షుడు బి .విజయకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక స్వతంత్య్ర పార్కులోరథ సప్తమి సందర్బంగా సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం ఆనందం మనశ్సాంతి కలిగించే యోగాను ప్రతి ఒక్కరు చేయాలని అన్నారు. 108 కేంద్రాల్లో రథసప్తమి సందర్భంగా యోగా కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రాణకోటికి ప్రాణ శక్తిని ప్రసాదించే యోగా విన్యాసాలను సూర్యనమస్కారాలు అంటామన్నారు. సూర్య నమస్కారాల వల్లన శరీరానికి మనస్సుకు జీవశక్తి సమృద్ధిగా అందుతుందన్నారు. విద్యార్థులతో యోగాశక్తి పై ఆసక్తి కలిగించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు . విద్యార్థులు యువత పెద్దఎత్తున సూర్యనమస్కారాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గౌతమబుద్ధ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ ,అరవ రాయప్ప, యోగా గురువు నజీర్ భాషా, ప్రణవ ఇనిస్టిట్యూట్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, ఆనంద్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రవి, నిర్మల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు .