కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
విజయవాడ ఫిబ్రవరి 19
దుర్గగుడిలో రెండవ రోజు కుడా ఏసిబి అధికారులు సోదాలు కొనసాగాయి. ఐదు బృందాలతో 25 మంది సిబ్బంది తో ఏకకాలంలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా లకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా సోదాలు జరుగుతున్నాయి. దాడులలో విజిలెన్స్, ఫుడ్ కంట్రోల్ అధికారులు కుడా పాల్గోన్నట్లు సమాచారం. ఇప్పటికే టిక్కెట్ కౌంటర్, చీరల కౌంటర్, స్టోర్స్ ,పరిపాలన విభాగంలో కీలక ఆధారాలు స్వీకరించినట్లు సమాచారం. మరోసారి పరిపాలన విభాగంలో రికార్డు లు, కంప్యూటర్ హర్డ్ డిస్కుల ను ఏసిబి అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు.