YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

భారత్‌లో కోటి మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌

భారత్‌లో కోటి మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌

భారత్‌లో కోటి మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌
న్యూఢిల్లీ ఫిబ్రవరి 19 
భారత్‌లో సాగుతున్న  ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌ కోటి మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి మరో మైలురాయిని చేరుకుందని అధికారులు తెలిపారు. మరోవైపు భారత్‌ ఇప్పటికే 25 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయగా మరో 49 కన్‌సైన్‌మెంట్లను పూర్తిచేయనుందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు.ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళాల కోసం ‌ రెండు లక్షల డోస్‌లను పంపుతామని భారత్  ఇప్పటికే ప్రకటించింది. కాగా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం అనుమతించింది. 

Related Posts