YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉద్యోగాలు రావాలంటే తెరాస పోవాలి కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలి టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉద్యోగాలు రావాలంటే తెరాస పోవాలి కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలి టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉద్యోగాలు రావాలంటే తెరాస పోవాలి
కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలి
టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 19
ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి  చిన్నారెడ్డి, మాజీ ఎమ్యెల్సి రాములు నాయక్ లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీకి నిలబెట్టడం జరిగిందని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన జూమ్ ఆప్ లో మాట్లాడారు.  చిన్నారెడ్డి  వ్యవసాయ రంగంలో పీహెచ్ది చేసిన వ్యక్తి. నిజాయితీ గల వ్యక్తి, సౌమ్యులు, నిరాడంబరులు చిన్నారెడ్డి. రాజకీయలు మొత్తం వ్యాపారాలుగా మారిపోయాయి. అలాంటి సమయాల్లో ఏ మాత్రం ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తి చిన్నారెడ్డి. రాములు నాయక్ కూడా నిరుపేద కుటుంబం లో పుట్టి తెలంగాణ ఉద్యమం లో కీలకంగా పాల్గొన్న వ్యక్తి. నిజమైన తెలంగాణ వాదులు వీళ్ళు.. సామాజిక న్యాయం అనుసరించే కాంగ్రెస్ ఒక జనరల్ స్థానంలో గిరిజన అభ్యర్థికి అవకాశం ఇచ్చామని అన్నారు. వీరిద్దర్నీ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిపించాలని కోరుతున్నా. 2018 ఎన్నికలలో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.  డు మూడు రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు..మరి ఎందుకు  ఇవ్వట్లేదు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ కు దెబ్బ కొడితే రావాల్సిన 3016 నిరుద్యోగ భృతి ఇస్తారు. పీఆర్సీ ప్రకటించిన నివేదికలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఇప్పటికి ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు.  ఇవన్నీ రావాలంటే టీఆర్ఎస్ ని చిత్తు చిత్తుగా ఓడించాలి. పీఆర్సీ కూడా నివేదిక ఇచ్చింది ఉద్యోగాల ఖాళీలు భారీగా ఉన్నాయని చెప్పింది. 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు..అంటే ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని 10 వేల ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్  తగ్గితే టీఆర్ఎస్ ని ఓడించండి. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తగ్గింది. అందుకే టీఆర్ఎస్ బుద్ధి చెప్పే విధంగా రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండని అయన అన్నారు.
రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోంది . కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని తీసుకురావడంలో బీజేపీ విఫలం అయ్యింది. మేము కూడా హిందువులమే. యోధ్య రామ మందిరం కు మేము వ్యతిరేకం  కాదు. కానీ భద్రాచలం రామాలయం ఎందుకు నిధులు కేటాయించలేదు. అక్కడి వేల ఎకరాల భూములు ఆంద్రప్రదేశ్ లో కలిసిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదు భద్రాచలం రామాలయం భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది కేంద్రం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ,టీఆర్ఎస్ ని ఓడించాలి. విద్యా వ్యాపారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క పైసా పని చేయలేదు. హైదరాబాద్ ఎమ్యెల్సి రామచంద్రరావు, నల్గొండ ఎమ్యెల్సి  పల్లా రాజేశ్వరరెడ్డి ఒక్క పని చేయలేదు. వాళ్ళు ఇద్దరు విఫలం అయ్యారు. వాళ్ళను ఓడించి అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలి. చిన్నారెడ్డి... ఎమ్యెల్సి గా గెలిచాక మన డిమాండ్లను పరిష్కరించేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఉత్తమ్ వెల్లడించారు. 

Related Posts