మానవ అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు
మానవ అక్రమ రవాణా నిరోధానికి ఉమ్మడి కార్యాచరణ
వివిధ డిపార్ట్మెంట్ అధికారులు కోఆర్డినేషన్ తో ప్రత్యేక చొరవ తీసుకొని పని చేయాలి
కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత
కామారెడ్డి ఫిబ్రవరి 19
హ్యూమన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా ఐపీఎస్ గారి సూచన మేరకు, పోలీస్ ప్రధాన కార్యాలయం లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏ హెచ్ టి యు యొక్క లక్ష్యాలను సబ్యులకు తెలియజేస్తూ మానవ అక్రమ రవాణాను నేర కోణంతో వ్యవహరించాలని మరియు కఠిన విధానాన్ని అవలంబించాలని సూచించారు.యూనిట్ సభ్యులందరు ఉమ్మడి కార్యచరణతో,సమన్వయం తో మానవ అక్రమ రవాణా కు అరికట్టాలని సూచించారు.మహిళలను చిన్నపిల్లలను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కుటుంబాలను వదిలి వివిధ రకాల కారణాలతో ఇంట్లో నుండి వెళ్లిపోయిన వారు, మతిస్థిమితం సరిగాలేక తప్పిపోయిన వ్యక్తులు, యువతులు,మహిళల మిస్సింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రెస్క్యూ చేసి కాపాడిన బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ వారు సరైన వైద్యం అందించాలని, అవసరమైతే మానసిక వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ అందించాలని అన్నారు. మానవ అక్రమ రవాణా అనేది మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరం అని దీన్ని నివారించటనికి అందరూ బాధ్యత తో వ్యవహరించాలని సూచించారు.ఈయొక్క ఏ హెచ్ టి యులో పోలీస్ శాఖ నుండి సిసిఎస్ ఇన్స్పెక్టర్ అభిలాష్న్, ఎస్.ఐ క్రిష్ణ, ఒక హెడ్ కానిస్టేబుల్, యిద్దరు కానిస్టేబుల్ ఉంటారని తెలిపారు.మానవ అక్రమ రవాణా కు సంబందించి ఎటువంటి సమాచారం ఉన్నా డైల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్స్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
అనంతరం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కొరకు తయారుచేసిన పోస్టర్లను సమావేశంలో పాల్గొన్న అధికారులు ఎస్పీ గారితో కలిసి ఆవిష్కరించారు.ఈ యొక్క యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నందు పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రెవెన్యూ శాఖ, హెల్త్, లేబర్ శాఖ, డి ఆర్ డి ఎ మరియు ఎస్ ఈ ఆర్ పి , చైల్డ్ హెల్ప్ లైన్, ఎన్జీవోస్ అధికారులు సభ్యులుగా ఉండే విధంగా ఏ హెచ్ టి యు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ యొక్క సమావేశంలో జిల్లా ఎస్పీ ఎన్. శ్వేత , కలెక్టర్ ఆఫీసు సూపరింటెండెంట్ ఎన్‌యూనుండి ఆర్ . నారాయణ , చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జే . స్రవంతి ,లేబర్ డిపార్టుమెంట్ నుండి సిహెచ్. ప్రబు దాస్, బి ఆర్ బి నుండి ఎస్. జానకి, మెప్మా నుండి అనసూయ
డి ఆర్ డి ఎ నుండి సి. సుదీర్,ఎన్జీవోఆర్‌వై. గంగాధర్ రావు,పి డి.యన్ సి ఎల్ పి నుండి జి. ప్రవీణ్ కుమార్, సకి నుండి ఆర్ . సయ్యవ్వ, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాంబాబు , సిసిఎస్ ఇన్స్పెక్టర్ అభిలాష్, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, మరియు ఏ హెచ్ టి యు సభ్యులు పాల్గొన్నారు