YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ మౌనమే గెలుపు అవుతోందా

కాంగ్రెస్ మౌనమే గెలుపు అవుతోందా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20, 
నిజమే కాంగ్రెస్ ఇలా ఉంటేనే ఎదుగుతుందేమో. ఊరికే హడావిడి చేసి ఆందోళనలు చేసినంత మాత్రాన నేతలు జేబులు ఖాళీ అవ్వడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. కొన్నాళ్లు మౌనంగా ఉండి మీడియా సమావేశాల ద్వారా తమ అభిప్రాయాలను చెప్పడమే బెటరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దానిని ఉద్యమాలు, ఆందోళనలతో ప్రజల్లోకి తీసుకెళ్లడం కంటే ప్రజలనే కష్టాలను భరింప చేయడమే మేలన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లుంది.నిజానికి 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపైన, ఆయన తీసుకున్న నిర్ణయాలపై ప్రజా ఉద్యమాలను నిర్వహించింది. అయితే అన్ని పోరాటాలు చేసినా చివరకు ప్రజలు మరోసారి మోడీకి పట్టంకట్టారు. నోట్ల రద్దు దగ్గర నుంచి జీఎస్టీ వరకూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కానీ ఫలితం లేదు. ప్రజలు మరోసారి మోదీ పక్షాన నిలిచారు. జీఎస్టీ వల్ల భవిష్యత్ లో భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.కానీ ఇప్పుడిప్పుడే జనాలకు జీఎస్టీ భారం తెలసి వస్తుంది. గతంలో ఉన్న పన్నుల కంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువ పన్నును చెల్లించాల్సి వస్తుంది. పేరుకు జీఎస్టీ అని ముందుగా తేలిగ్గా తీసుకున్న ఏ వస్తువు కొన్నా జీఎస్టీ భారాన్ని చూసి పెదవి విరుస్తున్నారు. నాడు కాంగ్రెస్ ఎంత పోరాటం చేసినా ప్రజల నుంచి పెద్దగా వారికి మద్దతు లభించలేదు. ఇక నిత్యం పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే పెట్రోలు, డీజిల్ ఉత్పత్తుల ధరలపైన కూడా కాంగ్రెస్ ఎటువంటి ఆందోళనలను నిర్వహించడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడే ప్రయత్నం చేయలేదు. దీనికి కారణం ప్రజలకు ప్రభుత్వం పెట్టిన భారాన్ని అనుభవించి చేసిన తప్పు తెలుసుకోవాలనుకోవడమే. అందుకే మరి కొంతకాలం ఇలాగే ఉంటే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందని, ప్రస్తుత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బాగుందని ప్రజల్లో భావన ఏర్పడే వరకూ ఇదే మెయిన్ టెయిన్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం గా ఉంది. ఒకరకంగా మంచిదేమో. నొప్పి తెలిస్తే గాని జనాల్లో కూడా మార్పు రాదుగా.

Related Posts