YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

చంద్రులకు... సన్... స్ట్ర్రోక్స్...

చంద్రులకు... సన్... స్ట్ర్రోక్స్...

హైదరాబాద్, ఫిబ్రవరి 20, 
పార్టీ అధినేతలకు తన వారసత్వాన్ని రాజకీయంగా కొనసాగించడం అనివార్యం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఇది సర్వ సాధారణం. ప్రజామోదం ఉన్న వారికి ఖచ్చితంగా వారసత్వం కలసి వస్తుందని అనేక రాష్ట్రాల్లో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో వారసత్వంగా అందివచ్చిన అవకాశం పార్టీ పరంగా లభించినా రాహుల్ గాంధీకి ప్రజామోదం ఇంతవరకూ లభించలేదు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగినా, ఆయన నాయకత్వంలో పార్టీ ఓటమి పాలయింది. తమిళనాడు ఎన్నికలను చూస్తే కరుణానిధి స్థానంలో ఆయన కుమారుడు స్టాలిన్ కు పార్టీ పగ్గాలు అందాయి. త్వరలో జరిగే ఎన్నికల ఫలితాలు స్టాలిన్ ను ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది తేలుతుంది. కరుణానిధి బతికున్నంతవరకూ స్టాలిన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కలేదు. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వచ్చిన వైఎస్ జగన్ స్వయం కృషితో ముఖ్యమంత్రి కాగలిగారు. తెలంగాణలో తాజాగా కేసీఆర్ తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించేది లేదని తెగేసి చెప్పారు. తాను పదేళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. వారసుడికి ఇంకా ప్రజామోదం లభించలేదని కేసీఆర్ అభిప్రాయపడి ఉండవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు తన వారసుడిని ఫోకస్ చేయాలని నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిపదవిని కట్టబెట్టారు. పార్టీలో తన తర్వాత స్థానాన్ని చంద్రబాబు కల్పించారు.ఇంతవరకూ బాగానే ఉన్నా చంద్రబాబు వయసు మీద పడుతుండటంతో వెంటనే లోకేష్ ను రాజకీయంగా ఎదగనివ్వాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఈసారి ఎన్నికలకు కూడా చంద్రబాబు నేతృత్వం వహిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశముంది. ఎందుకంటే కేసీఆర్ పై కుటుంబపరమైన వత్తిడులు లేవు. కానీ చంద్రబాబు మాత్రం లోకేష్ విషయంలో కుటుంబపరమైన వత్తిడులు ఎదుర్కొంటు న్నారు. 2014 తర్వాత కూడా చంద్రబాబుపై కుటుంబ పరంగా వచ్చిన వత్తిడి కారణంగానే చంద్రబాబు లోకేష్ ను మంత్రిని చేశారంటారు. దీంతో అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబు విధిగా లోకేష్ కు బాధ్యతలను అప్పగిస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది.

Related Posts