YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకి మతి, గతి తప్పాయి మంత్రి వెల్లంపల్లి 

చంద్రబాబుకి మతి, గతి తప్పాయి మంత్రి వెల్లంపల్లి 

చంద్రబాబుకి మతి, గతి తప్పాయి
మంత్రి వెల్లంపల్లి 
విజయవాడ ఫిబ్రవరి 20,
విజయవాడ నగరంలో మున్సిల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి తమ పార్టీ అభ్యర్థులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా రు.మూడు విడతల్లో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో వైసీపీ 80 శాతం గెలుచుకుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కుప్పం ఓటమితో చంద్రబాబు మతి తప్పి, గతి తప్పి మాట్లాడుతున్నారు. విజయవాడలో ఉన్న టీడీపీ నాయకుల్లో గ్రూపు తగాదాలు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి దోచుకుని మళ్లీ తగుదునమ్మా అని కేశినేని నాని మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. కేశినేని నాని తన కూతురు మేయర్ అని అంటారు.. కాదని టీడీపీ నేతలు అంటారు. అన్ని డ్రామాలే. కేశినేని శ్వేత ఓటమి అంచున ఉంది కచ్చితంగా ఓడిపోతుంది. అందుకనే నాని విత్ డ్రా చేసుకుంటాను అని అంటున్నారు. విజయవాడ 64 డివిజన్లు  కైవసం చేసుకుంటాం. ఆలయాల దాడులపై ప్రభుత్వం మద్దతు ఉందని జీవీఎల్, సోము వీర్రాజు బుద్ధి లేకుండా మాట్లాడుతు న్నారు. టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అని మంత్రి ఆరోపించారు.
 

Related Posts