తెలంగాణకు రూ.1940.95 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల
న్యూఢిల్లీ ఫిబ్రవరి 20
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో భాగంగా ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.5వేల కోట్లు విడుదల చేయగా.. ఇందులో తెలంగాణకు రూ.1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2222.71 కోట్లు చెల్లించింది. రాష్ట్రాలకు ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. రాష్ట్రాల 91శాతం లోటును భర్తీ చేశామని చెప్పింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.8,539.66 కోట్లు విడుదల చేసింది.