YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏ-2 రెడ్డీ.. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేయ్ కేసుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు

ఏ-2 రెడ్డీ.. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేయ్ కేసుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు

ఏ-2 రెడ్డీ.. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేయ్
కేసుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు
- బండారు సత్యన్నారాయణ మూర్తి
విజయవాడ ఫిబ్రవరి 20 
పోస్కో కంపెనీతో కుమ్మక్కై తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఇప్పుడు పాదయాత్ర అంటూ హడావుడి చేయడానికి విజయసాయిరెడ్డి సిగ్గుపడాలని మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి విమర్శించారు.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. విశాఖలో తిష్టవేసి చేసిన పాపాలు పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా తొలగిపోవు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఆత్మ అయినటువంటి ఉక్కును తెగనమ్ముకుని తమ ఖాతాల్లో వేసుకోవడానికి చూసి.. ఇప్పుడు పాదయాత్ర అంటూ ప్రజల్ని మభ్యబెట్టేందుకు ఏ-2 రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం ఎ2 రెడ్డికి తెలియదా.? జగన్, విజయసాయి రెడ్డిలో ఇసుమంతైనా నీతి, నిజాయితీ నమస్సాక్షి ఉంటే పోస్కో ఒప్పందం గురించి తెలియదని నిర్భయంగా చెప్పగలరా.? పోస్కో యాజమాన్యంతో ఇప్పటివరకు నువ్వు ఎన్నిసార్లు సమావేశమయ్యావు? ఢిల్లీలో ఎన్నిసార్లు కలిశావు? హైదరాబాద్, తాడేపల్లిలో సమావేశాలు నిర్వహించిన మాట వాస్తవం కాదా.? లోటస్పాండ్లో తెల్లవారుజాము వరకు పోస్కో కంపెనీ యాజమాన్యంతో మంతనాలు జరిపిన విషయం వాస్తవం కాదా? నీతోపాటు వైసీపీ ఎంపీలు పోస్కో యాజమాన్యంతో చర్చలు జరపలేదా? ఈ రోజు హడావుడి చేస్తున్న వైసీపీ నేతలు.. పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలి. స్టాంగ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉండి కూడా వైఎస్ అవినాశ్ రెడ్డి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు నిలదీయలేదో సమాధానం చెప్పాలి. డిజిన్వెస్ట్మెంట్పై ఢిల్లీలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలశాఖ ముఖ్య అధికారులను పంపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న  ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించి, తిరుగుబాటు చేయడంతో.. పాదయాత్ర పేరుతో హడావుడి చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీ కేసుల మాఫీ కోసం మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతామంటే  ఊరుకునేది లేదు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడుకుందామని చూస్తే.. పాదయాత్ర కాస్త పరుగు యాత్రగా మార్చి తరిమి కొట్టేందుకు విశాఖ ప్రజలు సిద్ధమయ్యారని నువ్వు, నీ దొంగల నాయకుడు గుర్తుంచుకోండని అన్నారు. 

Related Posts