YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

శ్రీ విద్యాదేవి

శ్రీ విద్యాదేవి

శ్రీ విద్యాదేవి
దశమహా విద్యాదేవిలలో మూడవ దేవతగా శ్రీ విద్యాదేవి కీర్తించబడుతున్నది.  త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతి,కుమారస్వామి
అగస్త్యుడు , ఇంద్రుడు
మన్మధుడు, చంద్రుడు, కుబేరుడు, అత్రి మహర్షి,
దూర్వాస మహర్షి, లోపాముద్ర, నందీశ్వరుడు, వరణుడు, వాయువు, బృహస్పతి , బుధుడు , యమ, దత్తాత్రేయ,  పరశురామ, 
బలదేవ, రతీదేవి, ఆదిశేషువు మొదలైన వారు లోక మాత అయిన ' శ్రీ విద్యాదేవిని'
ఉపాసించినట్లు  తంత్రశాస్త్రాలు తెలియ చేస్తున్నాయి.
శ్రీ లలితా పరమేశ్వరియే శ్రీ విద్య.  ఈమెయే శ్రీ మాత. శ్రీపుర నివాసిని. శ్రీ పురం మహామేరు పర్వత  శిఖరాగ్రాన వున్నది.
ఈ దేవి మంత్రము శ్రీ విద్య అని కీర్తిస్తుతున్నది.ఈ దేవి యొక్క యంత్రం "శ్రీ చక్రం" . దేవి సింహాసనం "శ్రీ సింహాసనంగా" తెలుపబడినది.

ఎఱ్ఱనిదేహఛ్ఛాయ,
సుందర కేశములలో అలంకరించబడిన చంపకం, అశోక పుష్పమాలలు. అమూల్యమైన పద్మరాగ మణులతో  ప్రకాశించే కిరీటం, నెలవంక వంటి నుదుటిపై నల్లటి కస్తూరి బొట్టు, అందమైన కనుబొమ్మలు, మీనాలవంటి  నేత్రాలు,
సంపెంగి పుష్పాన్ని పోలిన దీర్ఘ నాసిక,నక్షత్రం వలె మెరిసే నాసికాభరణం, కదంబ పూలగుత్తులు అలంకరించిన కర్ణములకు
సూర్య చంద్రులే ఆభరణాలు కాగా, పద్మరాగములవంటి అద్దాల చెక్కిళ్ళు,  పగడాల వంటి పెదవులు 
అని  లలితాసహస్రనామము
శ్రీవిద్యా మాత సౌందర్యాన్ని కీర్తిస్తున్నది.
ఈ దేవి పూజలో శ్రీ చక్రం
మహిమాన్వితమైనది .
శివమయమైన నాలుగు
చక్రాలు, శక్తి మయమైన ఐదు చక్రాలు మొత్తం  నవ చక్రాల అమరికయే  శ్రీ చక్రం.
ఈ చక్రంలో శ్రీ కామేశ్వరునితో  కలసి దేవి యీ లోకాన్ని పాలిస్తున్నది. భక్తిశ్రధ్ధలతో  దేవిని
నవావరణపూజగా శ్రీ చక్రపూజని చేసి  దేవిని సంతృప్తిపరిస్తే 
లొకానికి శుభాలు జరుగుతాయి.
ఈ దేవిని ఉపాసించి పూజిస్తే సర్వ శుభాలను పొందవచ్చునని శాస్త్రాలు
వివరిస్తున్నాయి. దేవి ధర్మ స్వరూపిణి. అందువలన
ధర్మ మార్గాన్ని అనుసరించి, దేవిని ఆరాధిస్తే ఇహ పర సౌఖ్యాలను ప్రసాదిస్తుంది.
ఈ దేవిని క్రింద వున్న మంత్రంతో నిత్యం
పూజించ వచ్చును.

శ్రీ విద్యా గాయత్రి...

ఓం మహాదేవ్యై చ విద్మహే
సర్వ శక్త్యై చ  ధీమహి
తన్నో విద్యా ప్రచోదయాత్.

మూల మంత్రం..
ఓం శ్రీ విద్యాయై నమః

 

Related Posts