YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలం, గ్లాసు లెక్కలేంటీ

కమలం, గ్లాసు లెక్కలేంటీ

కమలం, గ్లాసు లెక్కలేంటీ
విజయవాడ, ఫిబ్రవరి 22, 
పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ‌(మెజారిటీ పంచాయ‌తీల‌కు ఇవే ఎన్నిక‌లు) ద‌శ ముగిసింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా దాదాపుగా వ‌చ్చేశాయి. ముందు నుంచి అనుకున్నట్టుగానే వైసీపీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించింది. ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ సీమ‌తో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చేతులు ఎత్తేసింది. మిగిలిన జిల్లాల్లో చాలా నామ‌మాత్రపు ప్రభావం మాత్రమే చూపించింది. మ‌రి ఈ ఫ‌లితాల్లో ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌నే ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎక్క‌డనా ఒక్కపంచాయ‌తీలో అయినా.. త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్నాయా? త‌మ మ‌ద్దతు దారుల‌కు దీటుగా ద‌న్నుగా నిలిచాయా ? అంటే.. ఒక్కటంటే ఒక్కచోట కూడా నిల‌బ‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.తొలి ద‌శ‌ ఎన్నిక‌ల్లో ఒక్కచోట‌కూడా జ‌న‌సేన కానీ, బీజేపీ కానీ.. త‌మ మ‌ద్దతుదారుల‌ను గెలిపించుకోలేక పోయాయి. వాస్తవానికి ఈ ఎన్నిక‌ల్లో ఇరు పార్టీల‌కు మ‌ద్దతుదారులు క‌రువ‌య్యారు. అయిన‌ప్పటికీ.. తూర్పు, ప‌శ్చిమ‌, గుంటూరు, క‌ర్నూలు, చిత్తూరు పంచాయ‌తీల్లో త‌మ స‌త్తా చాటుతామ‌ని ఇటు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రక‌టించారు. త‌మ మ‌ద్దతు దారులకు సైలెంట్ ఓట్లు ప‌డ‌తాయ‌ని కూడా మీడియాకు చెప్పారు. ఇక‌, జ‌న‌సేన కూడా ఇదే ధీమా వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో త‌మ స‌త్తా చాటుతామ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ప్రక‌టించారు. ఈ క్రమంలోనూ అనూహ్యంగా ఆయ‌న జిల్లాల ప‌ర్యట‌న‌ల‌ను భుజాన వేసుకుని ముందుకు సాగారు.బీజేపీ + జ‌న‌సేన కాపు ఈక్వేష‌న్‌తో కాపుల ప్రభావం ఉన్న ప‌లు పంచాయ‌తీల్లో స‌త్తా చాటుతామ‌ని భావించారు. వైసీపీ అన్ని జిల్లాల్లోనూ తిరుగులేని ఆధిక్యంతో స‌త్తా చాటితే టీడీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే చావుత‌ప్పి క‌న్నులొట్టబోయి సింగిల్‌, డ‌బుల్ డిజిట్లు సాధించేందుకే ఆప‌సోపాలు ప‌డింది. అయితే.. జ‌న‌సేన‌, బీజేపీలు మ‌ద్దతిచ్చిన అభ్యర్థుల జాడ మాత్రం ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే క్షేత్రస్థాయిలో ఈ పార్టీని గుర్తు పెట్టుకునే వాళ్లే లేక ఏపీలో ఈ రెండు పార్టీలు క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌నేది విశ్లేష‌కుల మాట‌.క్షేత్రస్థాయిలో బ‌లం లేకుండా రేపు అధికారంలోకి ఎలా వ‌స్తారో బీజేపీ.. ప్రజాస‌మ‌స్యల‌పై నిజంగానే పోరాడి ఉంటే.. ఈ ఫ‌లితాలు ఇలా ఎందుకు వ‌చ్చాయో.. జ‌న‌సేన అంత‌ర్మథ‌నం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. ఈ రెండు పార్టీల‌కు ఫ్యూచ‌ర్ ఉండేనా ? అన్నదానిపై ఇప్పటికి అయినా వీరు అంత‌ర్మథ‌నం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రామ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకోకుండా.. మ‌ద్దతు దారుల‌ను కూడ‌గ‌ట్టుకోకుండా ఏ పార్టీ కూడా బ‌తికి బ‌ట్టక‌ట్టిన ప‌రిస్తితి ఈ రాష్ట్రంలో మ‌న‌కు ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పట‌కీ అయినా ఈ రెండు పార్టీల నేత‌లు పైపై మెరుగులు వ‌దిలేసి.. క్షేత్ర స్థాయిలో బ‌ల‌ప‌డితే వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి అయినా నాలుగు ఓట్లు కూడ‌గ‌ట్టుకుంటారు.

Related Posts