YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అడకత్తెరలో పోకచెక్కగా స్టీల్ ప్లాంట్

అడకత్తెరలో పోకచెక్కగా స్టీల్ ప్లాంట్

 అడకత్తెరలో పోకచెక్కగా స్టీల్ ప్లాంట్
విశాఖపట్టణం, ఫిబ్రవరి 22, 
విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఒక సెంటిమెంట్. విశాఖ గురించి ఎవరెక్కడ చెప్పినా కూడా అందులో ఉక్కు పరిశ్రమ ప్రస్తావన లేకుండా ఉండదు. అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోతున్నారు అన్న వార్త విశాఖ వాసుల్లో అతి పెద్ద కలవరం రేపుతోంది. జాతి సంపదగా ఉన్న విశాఖ ఉక్కుని ఏమీ కాకుండా పరాయి వారి చేతిలో పెట్టడాన్ని సాదర జనం జీర్ణించుకోలేకపోతున్నారు. మరో వైపు చూసుకుంటే విశాఖ ఉక్కు కార్మికులు భారీ ఉద్యమాన్ని చేపడుతున్నారు. రాజకీయ పార్టీల సాయాన్ని కూడా వారు అభ్యర్ధిస్తున్నారు.ఇక విశాఖ స్టీల్ కార్మికులు బీజేపీ మీదనే గుర్రుమీద ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగానూ ఆదుకోకుండా ఇపుడు సడెన్ గా నూటికి నూరు శాతం ప్రైవేటీకరణ చేయడానికి సిధ్ధపడడం పట్ల మండిపోతున్నారు. దానికి తోడు అన్నట్లుగా ఆంధ్రా బీజేపీ నాయకుల మాటలు కూడా చిర్రెత్తించేలా ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అయితే ప్రైవేటీకరణ వల్లనే విశాఖ స్టీల్ మరింతగా అభివృద్ధి సాగుతుందని చెప్పడం పట్ల ఉక్కు కార్మికులు ఆగ్రహిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ మాధవ్ కూడా ప్రైవేటీకరణ మీద అనుకూలంగా మాట్లాడడంతో బీజేపీ అంటేనే విరుచుకుపడుతున్నారు.ఇక విశాఖకు చెందిన జనసేన నాయకులు కూడా తాజా పరిణామాలతో ఫుల్ సైలెంట్ అయ్యారని చెప్పాలి. బీజేపీతో ఉన్న మితృత్వం వల్ల వారు బయటకు రావడానికి మీడియాకు కనబడడానికి కూడా వెనక్కి తగ్గుతున్నారు. అదే సమయంలో జనసేన స్టాండ్ ఏంటి అన్నది తెలియక లోకల్ లీడర్స్ అయోమయంలో పడుతున్నారు. ఇక పవన్ కేంద్ర పెద్దలతో మాట్లాడుతారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా ఆపుతారని కొందరు నేతలు చెబుతున్నా స్టీల్ కార్మికులు మాత్రం దాన్ని నమ్మడంలేదు. దాంతో అఖిల పక్ష సమావేశాలకు జనసేన రాకుండా తప్పుకుంది. పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు.మరో వైపు స్టీల్ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఒకరిని ఒకరు కార్నర్ చేసుకోవాలని టీడీపీ వైసీపీ చూస్తున్నాయి. తప్పంతా మీదంటే మీదని దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. చిత్రంగా అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ రెండు పార్టీలు తమ పొలిటికల్ అజెండానే ముందుకు తెస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లో బలమైన యూనియన్లు కలిగి ఉన్న కామ్రెడ్స్ మీదనే కార్మికులు ఎక్కువగా అధారపడి ముందుకు సాగుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మాత్రం మెయిన్ విలన్ గా బీజేపీ ఉంటే ఆ పార్టీతో దోస్తీ కట్టిన జనసేన బయటకు రాలేని పరిస్థితి మాత్రం ఉంది.

Related Posts