YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి తలనొప్పగా మారిన విశాఖ ప్లాంట్ ఉద్యమం

వైసీపీకి తలనొప్పగా మారిన విశాఖ ప్లాంట్ ఉద్యమం

వైసీపీకి తలనొప్పగా మారిన విశాఖ ప్లాంట్ ఉద్యమం

విశాఖపట్టణం, ఫిబ్రవరి 22  

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని ఎట్టకేలకు కేంద్రం నిర్ణయించింది. నిజానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం ఆరేళ్ల పాటు సమాలోచనలు సాగించింది అంటేనే విడ్డూరం. దానికి అనేక 
కారణాలు కూడా ఉన్నాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ది అర్ధ దశాబ్దం చరిత్ర. 1990లో నాటి ప్రధాని పీవీ నరసిం హారావు జాతికి అంకితం చేశారు. ఆ తరువాత గాడిన పడిన స్టీల్ ప్లాంట్ 2000 నుంచి 
లాభాల బాట పట్టింది. ఏకంగా స్టీల్ ప్లాంట్ 2015 వరకూ ఏకధాటిగా లాభాలనే తెచ్చి ఇచ్చింది. దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఇక స్టీల్ ప్లాంట్ 2015 తరువాత మెల్లగా నష్టాల్లోకి వెళ్ళింది. 
అపుడు కేంద్రంలో ప్రధానిగా మోడీ ఉన్నారు. దాంతో నాటి నుంచే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలను నిర్ణయించారు. ఇన్నాళ్ళకు అది జరుగుతోంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు 
లేవు. అవి కనుక ఇస్తే లాభాలు వస్తాయని అంతా చెబుతున్నారు.కానీ కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అందువల్ల వెనక్కి వెళ్తుందన్న ఆశలు 
అయితే లేవు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ని అడ్డం పెట్టుకుని రంజు అయిన రాజకీయం మాత్రం విశాఖలో సాగుతోంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వైసీపీయే కారణమని టీడీపీ గట్టిగా 
నినదిస్తోంది. ఆ పార్టీ విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అయితే అమరణ దీఖకు రెడీ అయిపోయారు. ఇక మరో వైపు చంద్రబాబు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తగిన 
వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్న కేంద్రాన్ని పక్కన పెట్టి వైసీపీనే కార్నర్ చేయాలన్నది ఆ వ్యూహం.ఇక అధికారంలో ఉన్న వైసీపీకి ఇది పూర్తిగా ఇరకాటమే అని అంటున్నారు. 
అసెంబ్లీలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దు అని తీర్మానం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మంత్రి వర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూడా కోరారు. మరో వైపు 
చూస్తే అఖిల పక్ష నేతలు నిన్నటిదాకా వైసీపీతోనే కలసి ఉన్నారు కానీ ఇపుడు వారు విభేదిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ సర్కార్ బాధ్యతను పూర్తిగా వేసుకోవాలని డిమాండ్ 
చేస్తున్నారువిశాఖ మేయర్ కి ఎన్నికలు తొందరలో ఉన్నాయి. దాంతో అధికార పార్టీని దెబ్బతీయడం ద్వారా కాగల లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయని 
అంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆపాలంటే అది కష్టసాధ్యమైన విషయం అన్నది తెలిసిందే. ఇక ఏపీలో బీజేపీకి ఏమీ రాజకీయంగా నష్టం లేదు. దాంతో వైసీపీని టార్గెట్ చేస్తే ఏపీ వరకూ 
రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చు అని టీడీపీ ప్లాన్ చేస్తోంది అంటున్నారు. వెంటనే వచ్చే లాభం విశాఖ మేయర్ సీటు అని కూడా టీడీపీ పెద్దలు గట్టిగానే ఉక్కు విషయంలో వైసీపీ మెడకు ఉచ్చు 
బిగిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
 

Related Posts