YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తమిళనాడు ఎన్నికల కు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి

తమిళనాడు ఎన్నికల కు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి

తలైవా...
 ఫిబ్రవరి 22
తమిళనాడు ఎన్నికల కు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలు ఎవరూ తమను చూసి ఓటేయమని కోరకపోవడమే ఈ ఎన్నికల ప్రత్యేకత. అన్నాడీఎంకే అమ్మను చూసి 
ఓటేయ్యమంటుంటే… డీఎంకే నాన్న అభివృద్ధిని మరవవద్దని కోరుతోంది. ఇలా తమిళనాడు ఎన్నికలు జయలలిత, కరుణానిధిల నామస్మరణతోనే జరుగుతున్నాయి. తమిళనాడులో కరుణానిధి, 
జయలలిత మరణం తర్వాత జరుగుతున్న ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.అన్నాడీఎంకేను జయలిలిత అనేక సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. 2011, 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 
అన్నాడీఎంకే విజయం సాధించడానికి జయలలిత నాయకత్వమే కారణం. ఎన్నికల సమయంలో ప్రకటించిన తాయిలాలు, జయలలిత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి వరసగా 
రెండుసార్లు అన్నాడీఎంకేకు విజయం సాధించి పెట్టాయి. రెండో సారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే జయలలిత మరణించారు.జయలిలత మరణం తర్వాత అన్నాడీఎంకేలో నాయకత్వం లేదు. 
పళనిస్వామి నేతృత్వంలో దాదాపు నాలుగేళ్ల పాలన సజావుగానే జరిగినా ఎన్నికలను ఎదుర్కొనే సామర్థ్యం, సత్తా వీరికి లేదు. దీంతో వీరు జయలలిత బొమ్మతోనే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఇక 
పార్టీ నుంచి బహిష‌్కరించబడిన శశికళ సయితం తాను అమ్మ జయలలిత వారసత్వాన్ని కొనసాగిస్తా నంటున్నారు. అన్నాడీఎంకే పార్టీని కూడా తాను స్వాధీనం చేసుకుంటామంటున్నారు.అలాగే 
డీఎంకేలో కూడా కరుణానిధి మరణం తర్వాత నాయకత్వ సమస్య లేదు. స్టాలిన్ పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. పదేళ్ల పాటు అధికారంలో లేకపోవడంతో ఈసారి గద్దెనెక్కాలని తీవ్రంగా 
శ్రమిస్తున్నారు. అయితే సోదరుడు ఆళగిరి తండ్రి బొమ్మతో డీఎంకేకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. స్టాలిన్ మాత్రం కరుణానిధి ఆశయాలను కొనసాగిస్తానంటూ ఆయన బొమ్మతోనే ప్రచారాన్ని 
నిర్వహిస్తున్నారు. కరుణానిధి తరహాలోనే తాను పాలన చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికలు అమ్మా, నాన్నల మధ్యనే జరుగుతున్నాయని చెప్పాలి.

Related Posts