YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

పార్టీపై ముస్లింల రక్తపు మరకలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వివాదాస్పద వ్యాఖ్యలు

పార్టీపై ముస్లింల రక్తపు మరకలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తన సొంత పార్టీని ఇరుకున పెట్టారు. తన పార్టీపై ముస్లింల రక్తపు మరకలు ఉన్నాయన్నారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆయన మంగళవారం విద్యార్థులతో మాట్లాడినపుడు ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అమిర్ మింటోయీ అనే విద్యార్థి మాట్లాడుతూ అత్యధిక అల్లర్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే జరిగాయని ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినపుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని గుర్తు చేశారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం చట్టాన్ని 1948లో సవరించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కోటా క్రింద రిజర్వేషన్లను ముస్లిం దళితులు కోల్పోయారు. హషీంపుర, మల్యానా, మీరట్, ముజఫర్‌నగర్, భాగల్పూరు, మొరాదాబాద్, అలీగఢ్‌లలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఈ మరకలన్నిటినీ కాంగ్రెస్ చేతి నుంచి ఎలా కడిగేసుకుంటారని అడిగారు.దీనిపై సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ముస్లింల రక్తపు మరకలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతగా తన చేతికి కూడా ఆ మరకలు ఉన్నట్లు భావిస్తానన్నారు.

Related Posts