మాస్క్.. పెనాల్టీల మొత్తం 30కోట్లు
ముంబై, ఫిబ్రవరి 22
దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి మాస్క్‌లను ధరించడం, సామాజిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేశారు. దీంతోపాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఫైన్లను కూడా వసూలు
చేస్తున్నాయి. ఒక దశలో ఢిల్లీలో అయితే మాస్క్ ధరించకపోతే ఏకంగా రూ.500 వరకు జరిమానా వసూలు చేశారు. అయితే ఈ జరిమానాల విషయానికి వస్తే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు భలే
ఆదాయం వచ్చిందగత 10 నెలల కాలంలో మాస్క్‌లు ధరించని మొత్తం 15,71,679 మందిపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు కేసులు నమోదు చేశారు. దీంతో వారి ద్వారా రూ.31,79,43,400
ఫైన్లు వసూలు అయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో ఫైన్లు వసూలు చేశారంటే.. అక్కడ మాస్క్‌లను ఎంత మంది ధరించడం లేదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక కేవలం ఫిబ్రవరి 19వ తేదీనే 13వేల
మందికి ఫైన్ వేసి రూ.27 లక్షలను వసూలు చేశారు. అంటే.. అక్కడ కరోనా నిబంధనలను అసలు పాటించడం లేదని స్పష్టమవుతుంది.ఇక మహారాష్ట్రలో మళ్లీ తాజాగా కరోనా ప్రభావం మొదలైంది.
అక్కడ గత కొద్ది రోజులుగా నిత్యం నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. శుక్రవారం అక్కడ 6,112 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని పూణె, నాసిక్,
నాగ్‌పూర్, వార్దా, యవత్‌మాల్, అమరావతి, అకోలా, బుల్ధానా జిల్లాల్లో కఠిన కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నారు.