YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ హ్యాట్రిక్ కోసం షర్మిల..

కేసీఆర్ హ్యాట్రిక్ కోసం షర్మిల..

కేసీఆర్ హ్యాట్రిక్ కోసం షర్మిల..

హైదరాబాద్, ఫిబ్రవరి 22
తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు లేకపోయినా హీటెక్కుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు కొనసాగుతానని చెప్పిన కేసీఆర్ అడుగులు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఒక్కొక్క 
పార్టీకి ఒక్కోరకంగా చెక్ పెడుతున్నారు. అంతేకాదు కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలకు కూడా ఆదిలోనే ఝలక్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని 
పెట్టబోతున్నారు. రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు.ఇది కేసీఆర్ వ్యూహమేనంటూ బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు కేసీఆర్ షర్మిలను 
తెరమీదకు తెచ్చారని చెబుతన్నాు. మరోవైపు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సయితం షర్మిల పార్టీ వెనక కేసీఆర్ హస్తం ఉందని చెబుతున్నారు. బ్యాక్ గ్రౌండ్, ఆర్థిక సాయం అంతా కేసీఆర్ 
చూసుకుంటున్నారని, కాంగ్రెస్ ను బలహీనపర్చడానికి, కొన్ని వర్గాల ఓట్లను చీల్చి టీఆర్ఎస్ ను కాపాడటానికే షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని ఆరోపించారు.అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పటికే 
కాంగ్రెస్ నాయకత్వ లేమితో బాధపడుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. మరోవైపు బీజేపీ దూసుకువస్తుంది. బీజేపీ బలపడటం ఒకరకంగా కేసీఆర్ కు లాభమే. కొన్ని 
సీట్లు తగ్గినా అధికారం మాత్రం కోల్పోమన్న విశ్వాసం కేసీఆర్ లో ఉంది. అందుకే ఆ రెండు పార్టీలను లైట్ గా తీసుకుంటున్నారు. అయితే కొత్తగా రెండు ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయని తెలిసి 
షర్మిలతో ఈ పార్టీ పెట్టించారనే వాదన కూడా లేకపోలేదు.టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ ఆ పార్టీని వీడి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఉంది. అందుకే అధినాయకత్వంపై థిక్కార స్వరం 
విన్పిస్తున్నారంటారు. కేటీఆర్ స్థానంలో ఈటలను ముఖ్యమంత్రిని చేయాలని కూడా విపక్షాలు కోరుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారంటున్నారు. వీరిద్దరికి 
చెక్ పెట్టేందుకు వైఎస్ షర్మిలను కేసీఆర్ తెచ్చారన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి. ఇటు రెడ్డి సామాజికవర్గం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లలో చీలిక తెచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్నదే కేసీఆర్ 
ఆలోచనగా ఉందంటున్నారు

Related Posts