మాజీ ఎంపీపీ భర్త హత్య
వికారాబాద్ ఫిబ్రవరి 22
పెద్దేముల్ మండలం హన్మపూర్ లో దారుణ హత్య జరిగింది. పెద్దేముల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వాణిశ్రీ భర్త వీరప్ప ను గ్రామంలో స్థానిక సర్పంచ్ కుటుంబ సభ్యులు ఊరడమ్మ గుడి దగ్గర కర్రలతో కొట్టి హత్య చేసారని పోలీసులు వెల్లడించారు. ఒక పంచాయతీ విషయంలో గ్రామంలోని హనుమాన్ దేవాలయం కూడలి వద్ద మాట్లాడుకుంటుండగా ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పర దాడులు జరుపుకున్నారు. మాజీ ఎంపీపీ, టిఆర్ఎస్ పార్టీ నేత వీరప్ప తలకు తీవ్ర గాయాలు కావడంతో అయనను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజకీయ కక్షల వల్లే హత్య జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. డిఎస్పి లక్ష్మీనారాయణ గ్రామానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు