YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

ఇంటర్ టెన్షన్

ఇంటర్ టెన్షన్
జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో నిరాశాజనక ఫలితాలు రావడం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత గణనీయంగా పడిపోవడంతో వాటిలో విద్యా ప్రమాణాల తీరు చర్చనీయాంశంగా మారింది.విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్‌ కీలక దశ కాగా ఇక్కడ గట్టి పునాదులు పడితేనే భవిష్యత్తుకు బంగారుబాట పడుతుంది. కానీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లా గతం కన్నా బాగా వెనుకబడింది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ఫలితాల సరళి అక్కడ విద్యా బోధనలో వైఫల్యాలను బహిర్గతం చేస్తోంది. జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 20 ప్రభుత్వ ఒకేషనల్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి 13,688 మంది విద్యార్థులు అభ్యసించారు. వీరిలో 7,194 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరిస్థితిలో కాలేజీల్లో దిద్దుబాటు చర్యలకు సంబంధిత అధికారులు ఉపక్రమించాల్సిన అవసరముంది. వాస్తవంగా కళాశాలల్లో సిలబస్‌ పూర్తయిన తీరును ప్రతి నెలా సమీక్షించాల్సి ఉంది. అలాగు అధ్యాపకుల బోధన తీరును కూడా పర్యవేక్షించాల్సిన ఇంటర్‌ బోర్డు అధికారులు అసలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.ప్రతి కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసి ఆ మేరకు వారిని తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో ఈ కార్యక్రమం సరిగా అమలు జరగలేదన్న విమర్శలున్నాయి.దీనికితోడు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విషయక కేలెండర్‌ ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఇది కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా అధ్యాపకుల కొరత దీనికి ప్రతిబంధకంగా మారింది. చర్యలకు సంబంధిత అధికారులు ఉపక్రమించాల్సిన అవసరముంది. వాస్తవంగా కళాశాలల్లో సిలబస్‌ పూర్తయిన తీరును ప్రతి నెలా సమీక్షించాల్సి ఉంది. అలాగు అధ్యాపకుల బోధన తీరును కూడా పర్యవేక్షించాల్సిన ఇంటర్‌ బోర్డు అధికారులు అసలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.ప్రతి కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసి ఆ మేరకు వారిని తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో ఈ కార్యక్రమం సరిగా అమలు జరగలేదన్న విమర్శలున్నాయి.దీనికితోడు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విషయక కేలెండర్‌ ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఇది కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా అధ్యాపకుల కొరత దీనికి ప్రతిబంధకంగా మారింది.

Related Posts