కర్నాటకలో జిలెటెన్ స్టిక్స్ పేలుడు.. ఆరుగురి మృతి
బెంగళూరు ఫిబ్రవరి 23,
కర్నాటక శివమొగ్గ చిక్‌బళ్లాపూర్ తాలూకలోని హిరెనాగవేలి భారీ పేలుడు సంభవించింది. జిలెటెన్ స్టిక్స్ పేలిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను జిల్లా హాస్పిటల్‌కు హాస్పిటల్‌కు తరలించారు. కాగా, పేలుడు ధాటికి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు వచ్చాయి. అలాగే వెయ్యి అడుగుల దూరం వరకు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు వాటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా జిలెటిన్ స్టిక్స్ పేలినట్లు సమాచారం. వాటిని మైనింగ్ కోసం అక్రమంగా నిలువ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత జనవరిలోనూ శివమొగ్గ జిలిటెన్‌స్టిక్స్ పేలిన ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు.