YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

త్వరలో అందుబాటులోకి రానున్న మైండ్ స్పేస్ అండ‌ర్ పాస్

త్వరలో అందుబాటులోకి రానున్న మైండ్ స్పేస్ అండ‌ర్ పాస్
గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో చేప‌ట్టిన సిగ్న‌ల్ ఫ్రీ ర‌హ‌దారుల వ్య‌వ‌స్థ‌లో రెండ‌వ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. రూ. 25.78 కోట్ల వ్య‌యంతో నిర్మించిన మైండ్ స్పేస్ జంక్ష‌న్ అండ‌ర్ పాస్ పూర్తిగా సిద్ద‌మై ఒక‌టి రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ అండ‌ర్ పాస్ వ‌ల్ల సైబ‌ర్ ట‌వ‌ర్స్ నుండి బ‌యోడైవ‌ర్సిటీ వైపు ఇరువైపులా వెళ్లే రాక‌పోక‌లు సులువుగా మార‌నున్నాయి. మొత్తం 305 మీటర్ల పొడ‌వులో ఉన్న ఈ మైండ్ స్పేస్ అండ‌ర్ పాస్‌లో 83 మీట‌ర్ల క్లోజ్‌డ్ బ్యాక్స్‌గా నిర్మించారు. 28.80 మీట‌ర్ల వెడ‌ల‌ప్పు ఐదున్న‌ర మీట‌ర్ల ఎత్తుతో ఇరువైపులా ఆరులైన్ల క్యారేజ్ వేల‌ను నిర్మించారు. ప్ర‌స్తుతం ఈ మార్గంలో గంట‌ల‌కు 14,400 వాహ‌నాలు ప్ర‌యాణిస్తున్నాయి. 2035 నాటికి ఈ వాహ‌నాల సంఖ్య 31,356కు పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. ఈ ట్రాఫిక్ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని రూ. 25.78 కోట్ల వ్య‌యంతో 2016 ఏప్రిల్ 2వ తేదీన ఈ మైండ్ స్పేస్ అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ అండ‌ర్ పాస్ నిర్మించానికి అండంగా భూగ‌ర్బ కేబుళ్లు, మంచినీటి పైప్‌లైన్లు, సీవ‌రేజ్ పైపులైన్లు, ఆఫ్టిక్ట్ ఫైబ‌ర్ కేబుళ్ల‌ను తొల‌గించి తిరిగి వాటిని అమ‌ర్చ‌డంలో జీహెచ్ఎంసీ ఇంజ‌నీర్లు తీవ్రంగా శ్ర‌మ‌ప‌డ్డారు. సంబంధిత శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో విజ‌య‌వంతంగా తొల‌గించి ఈ అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నుల‌ను నేటికి పూర్తి చేశారు. ఇటీవ‌లే బ‌యో డైవ‌ర్సిటీ అండ‌ర్ పాస్‌ను విజ‌య‌వంతంగా ప్రారంభించుకొని వేలాది వాహ‌న‌దారుల‌కు సౌల‌భ్యం క‌ల్గించిన జీహెచ్ఎంసీ ఎస్‌.ఆర్‌.డి.పిలో సిద్దంగా ఉన్న రెండ‌వ ప్రాజెక్ట్ మైండ్ స్పేస్ అండ‌ర్ పాస్‌ను రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌లు ప్రారంభించ‌నున్నారు. వీటితో పాటు చింత‌ల్ కుంట చెక్‌పోస్ట్ అండ‌ర్ పాస్ నిర్మాణం కూడా పూర్త‌యి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

Related Posts