YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీటీడీపీ పోటీకి... లెక్కంటీ

టీటీడీపీ పోటీకి... లెక్కంటీ

టీటీడీపీ పోటీకి... లెక్కంటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 24, 
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నామమాత్రంగానే ఉంది. గతంలో మాదిరిగా ఏ జిల్లాలోనూ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. మొన్నటి వరకూ మహబూబ్ నగర్, ఖమ్మం, హైదరాబాద్ నగరంలో టీడీపీ ప్రభావం చూపుతుందనుకునే వారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ టీడీపీ గెలవలేదు. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో తెలంగాణలో టీడీపీ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పోటీకి దిగడానికి కారణమేంటన్న ప్రశ్న పార్టీలో చర్చ జరుగుతుంది.తెలంగాణాలో టీడీపీకి పెద్దగా అవకాశాలు లేవు. చంద్రబాబు సయితం తెలంగాణ టీడీపీిని పెద్దగా పట్టంచుకోవడం లేదు. ఆయనకు ఆంధ్రలోని టీడీపీని రక్షించుకోవడానికే సమయం సరిపోవడం లేదు. తెలంగాణలో కొందరు నేతలు విభేదిస్తున్నా తనకు నమ్మకమైన నేతగా ఉన్న ఎల్.రమణను తిరిగి రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అయితే కొంతకాలం క్రితం హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేసినా ధరావత్తు దక్కించుకోలేకపోయింది. పార్లమెంటు ఎన్నికలకు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికకుకు టీడీపీ దూరంగా ఉంది.తెలంగాణలో ఇప్పటికే అనేకమంది నేతలు టీడీపీని వదలివెళ్లిపోయారు. ఉన్న కొద్ది మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వీటన్నింటికి నిధుల సమస్య అని చెబుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూడా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయనే చెప్పాలి. అలాంటిది ఒక్కసారిగా ఎల్.రమణ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీకి దిగుతానని నిర్ణయం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఎల్.రమణకు ఓకే చెప్పడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.అయితే ఈ పరిస్థితుల్లో ఎల్.రమణ హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి పట్టభధ్రుల స్థానానికి పోటీ చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మూడు జిల్లాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే రమణ పోటీ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి ఓటమి పాలయితే పార్టీ పరువేంకాను అని ప్రశ్నించే వారు లేకపోలేదు. ఎల్ రమణ వ్యతిరేక వర్గమయితే ఎన్నికల నిధుల కోసమే ఎల్.రమణ బరిలోకి దిగారని కూడా అంటున్నారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యగా పనిచేసిన ఎల్.రమణకు ఈ పోటీ అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరొకరి అవకాశమిచ్చినా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Posts